1. పాలు, పెరుగుల్లో ఉండే ''ట్రిప్టోఫాన్'' నిద్రను ప్రేరేపిస్తుంది. ఈ అమీనో యాసిడ్ బాడీ క్లాక్ పనితీరును క్రమబద్ధీకరించే సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా కంటి నిండా నిద్ర పడుతుంది.
2. బార్లీ గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదులో తీసుకున్నా నిద్ర పడుతుంది.
3. అరటి పళ్లల్లో మెగ్నీషియం, పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి వేళ కండరాల నొప్పులు తలెత్తకుండా చేస్తాయి.
4. ఓట్స్‌లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. నిద్రకు ముందు గోరువెచ్చని ఓట్స్ వంటకం తింటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
5. నిద్రకు ముందు గోరు వెచ్చని పాలు తాగినా ఫలితం ఉంటుంది. ఫ్లాక్స్ విత్తనాల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం ద్వారా ఆందోళన, ఒత్తిడి, నిరాశల తీవ్రతను తగ్గించి వాటి వల్ల తలెత్తే ఇన్‌సోమ్నియా (నిద్రలేమి)ని పోగొడతాయి.
No comments:
Post a Comment