1. జలుబు చేసి నప్పుడు ముక్కు పట్టేసినట్లువుంటె ఇలా చేసి
చూడండి.ఒక కప్పు నీటిలో చిన్న అల్లం ముక్క చిదగొట్టి వేసి
మరిగించండి.గోరు వెచ్చగా ఉండగానే చిటికెడు మిరియాలపొడి కలిపి
వడ పోసుకొని తాగండి.వెంటనే రిలీఫ్ వస్తుంది.
2.చర్మం కోసం :
1. బొప్పాయి ,అరటి ,జామ ,ఆపిల్ పండ్లను ఎక్కువ తినాలి.మంచినీరు ఎక్కువ త్రాగాలి.
2. సి విటమిన్ చర్మాని కి చాలా మంచిది కాబట్టి నిమ్మ ,ఊసిరి వంటి పండ్ల ని తినాలి.
3. తేనె తీసుకోవడం వాళ్ళ చర్మం పొడి బారకుండ ఉంటుంది.
4. బాదం పప్పు నానాపెట్టి ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడి బారదు.
5. పండ్ల రసాలు త్రాగడం వల్ల చర్మం నిగ నిగ లాడుతుంది.
6. చర్మం నల్ల బడకుండా ఉండాలంటే , శరీరానికి నిమ్మ రసం రాస్తే మంచిది.
7. మోచేతులు గరుకు గా ఉంటె వారానికి రెండు సార్లు నిమ్మరసం రాసి 10 నిమిషాల తరువాత కడుక్కోవాలి
3.చుండ్రు తగ్గటానికి :
1. వెంట్రుకల కి పెరుగు పట్టించి అరగంట తర్వాత తల స్నానం
చేస్తే చుండ్రు తగ్గుతుంది.
2. వారానికి రెండు సార్లు కుంకుడుకాయతో కాని సీకాయతో కాని తలస్నానం చెయ్యాలి.
3. జుట్టు కి తల నూనెతో మసాజ్ చేసుకోవడం కూడా మంచి
ఫలితాన్ని ఇస్తుంది.
4. కొంచెం నిమ్మరసం కొబ్బరి నునెలో కలిపి తలకి పట్టించి
5. అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
6. గసగసాలను పేస్టులా చేసి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం
6. గసగసాలను పేస్టులా చేసి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం
చెయ్యాలి.
No comments:
Post a Comment