Saturday, December 13, 2014

కాఫీ పొడి తో అందానికి కొన్ని చిట్కాలు .tips with coffee powder


1. టీస్పూన్ తేనె, కాఫీ పౌడర్, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై  చేయాలి. 15 నిమిషాల పాటు ఉంచి ముఖాన్ని కడుక్కుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇందులో ఉన్న విటమిన్ సి వల్ల మరింత ఫ్రెష్‌గా కనిపిస్తారు.
 

2. కొంచెం కాఫీ పౌడర్, పెరుగు, ఓట్‌మీల్ పౌడర్, తేనె కలిపి మెడకు, ముఖానికి రాసుకొని ఓ అరగంట పాటు ఉంచుకోవాలి. ఇది మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది

3 . ఆలివ్ ఆయిల్, కాఫీ పౌడర్ మిక్స్‌ను ముఖానికి రాసుకొని ఓ పదినిమిషాల పాటు ఉంచి కడిగితే చర్మం పొడిబారదు.
4.  టీ స్పూన్ కాఫీ పౌడర్, కొంచెం కోకో పౌడర్, తేనె కలిపిన ప్యాక్‌ను ముఖానికి రాసి తర్వాత చల్లని నీళ్లతో కడుక్కుంటే ముఖంపై పేరుకున్న మృతకణాలను తొలిగిపోతాయి

Friday, December 5, 2014

మంచి నిద్ర కోసం tips

 
1.  పాలు, పెరుగుల్లో ఉండే ''ట్రిప్టోఫాన్'' నిద్రను ప్రేరేపిస్తుంది. ఈ అమీనో యాసిడ్ బాడీ క్లాక్ పనితీరును క్రమబద్ధీకరించే సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా కంటి నిండా నిద్ర పడుతుంది. 
 
2. బార్లీ గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదులో తీసుకున్నా నిద్ర పడుతుంది. 
 
3. అరటి పళ్లల్లో మెగ్నీషియం, పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి వేళ కండరాల నొప్పులు తలెత్తకుండా చేస్తాయి. 
 
4. ఓట్స్‌లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. నిద్రకు ముందు గోరువెచ్చని ఓట్స్ వంటకం తింటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. 
 
5. నిద్రకు ముందు గోరు వెచ్చని పాలు తాగినా ఫలితం ఉంటుంది. ఫ్లాక్స్ విత్తనాల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం ద్వారా ఆందోళన, ఒత్తిడి, నిరాశల తీవ్రతను తగ్గించి వాటి వల్ల తలెత్తే ఇన్‌సోమ్నియా (నిద్రలేమి)ని పోగొడతాయి.

Thursday, November 27, 2014

ఏ పనికి ఎన్ని కేలరీ లు తగ్గుతాయి


ఒక గంట  పని చేస్తే ఎన్ని కేలరీల శక్తి వినియోగం అవుతుందంటే 
వంట ---- 148
ఇల్లు శుభ్రం చేయడం ----207 
వాకింగ్ --- 200 
పరుగెత్తడం --- 400 
నత్యం -- 266 
బ్యాడ్మింటన్ ఆడటం -- 400

మధుమేహమ్ ఉన్నవాళ్ళకి కొన్ని చిట్కాలు ..halth tips for diabetics

1. శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ఖచ్చితంగా పాటించాలి 

2. స్వీట్లు, జామ్‌లు, ఐస్‌క్రీమ్‌లు, మిల్క్‌షేక్స్, చాక్లెట్లు, బిస్కట్లు, బేకరీ ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి . తీసుకోకుండా ఉంటె మరి మంచిది. 

3. మామిడి, ఖర్జూరాలు, సీతాఫలాలు, అరటిపండ్లు తప్ప ఏ పండ్లయినా తినవచ్చు. పండ్ల రసాల కన్నా పండ్లు తినడమే ఉత్తమం. 

4. అన్నం, బంగాళదుంపలు, కందగడ్డ లు తీసుకోవద్దు ఎందుకంటె అందులో ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి 

5. తేనె కూడా తీసుకోవద్దు 

6. కూరగాయలు ఎక్కువ తినాలి . క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, కీరాకాయ లతో చేసిన సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి 

7. మాంసాహారం లో చేపలు , గుడ్డు లోని తెల్ల సోన తీసుకోవాలి 

8. ప్రతి రోజు 30 నుండి 50 నిమిషాల వరకి  వాకింగ్ చేయాలి . ఎక్కువ బరువు ఉంటె తగించుకోవడం మంచిది. 

9. మద్యం సేవించడం , ప్రోగాతాగడం మాని వేయాలి 

Sunday, November 9, 2014

చలి కాలం తినాల్సిన ఆహరం ..food tips for winter


వేరుశనగలు


వేరుశనగల్లో విటమిన్ ఇ, బి3 పుష్కలంగా ఉంటాయి. మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వేరుశనగగింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది.

పాలకూర


ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజు పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీసుకున్నా ఎంతో మంచిది. ఎముకల పటిష్టానికి పాలకూర దోహద పడుతుంది.

స్వీట్ పొటాటో


చిలకడ దుంపలు చక్కటి పోషకాహారం. ఈ దుంపలు శరీరానికి కావాల్సిన వేడిని అందిస్తాయి. పిల్లలకు, వృద్ధులకు ఇవి ఎంతో అవసరం. ఈ దుంపల్లో ఉండే పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, సీతో పాటు ఖనిజ లవణాల్ని శరీరానికి అందిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే టేస్టీగా ఉంటాయి.

జొన్నలు

వారానికి ఒక్కసారైనా జొన్నలతో చేసిన ఆహారం తీసుకోవాలి. జొన్నలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కండరాల కదలికలకు బాగా ఉపకరిస్తుంది. జొన్నతో చేసిన పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కూడా లభిస్తుంది.

నువ్వులు

నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీస్, ఐరన్ మెగ్నీషియం వంటివి ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. నువ్వుల వల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది.

దానిమ్మ


దానిమ్మ రక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది. చలికాలం దీని అవసరం చాలా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు, పాస్పరస్ కావాల్సినంత లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరం అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి.

Saturday, October 18, 2014

ఒత్తిడి తగ్గించే ఆహార పదార్థాలు

అధిక రక్తపోటు... మధుమేహం... పక్షవాతం... స్థూలకాయం... పొగతాగడం...సోమరితనం...ఉప్పు ఎక్కువగా తీసుకోవడం...దీర్ఘకాలిక ఒత్తిడులు...నిద్ర పట్టకపోవడం... లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వీటి తగ్గుదల కోసం కొన్ని ఆహార చిట్కాలు పాటించి చూడండి!

1. బిపి 110-70 ఉంటుందా? అయితే ప్రతిరోజూ ఆహారంలో గుడ్డులోని తెల్లని భాగాన్ని చేర్చుకోండి. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. అంతేకాక, అది ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.

2.  వృక్ష సంబంధమైన ఆహారంలో ఉండే ప్రొటీన్లు లభించే బ్రకోలి, బీన్స్‌, బ్రౌన్‌ రైస్‌, ఓట్‌మీల్‌ లాంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లను అందించగలుగుతార.

3. సోయా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలోని సోడియం స్థాయిల్ని సమతుల్యం చేస్తుంది.

4.  వారంలో రెండు,మూడుసార్లు ఆహారంలో ఆకుకూరల్ని చేర్చడంతో కాల్షియం, పీచు పదార్థాలు కావల్సినంత అందుతాయి.

5.  రక్తనాళాల వాపు తగ్గించడానికి చురుకుదనాన్ని పెంచడానికి చాక్లెట్‌లు ఎంతో ఉపయోగపడతాయి. అలాగని ఎక్కువగా తీసుకోకూడదు. 30కేలరీల శక్తినిచ్చే వరకూ తీసుకోవచ్చు. దీనితో పాటు నిత్యం వాడే మాత్రలను మరచిపోకండి.

6. వీటన్నింటినీ పాటిస్తూనే రోజూ 30 నిమిషాల నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది.

7. శాచ్యురేటెడ్‌ కొవ్వులు, చక్కెర, చక్కెర సిరప్‌లను 100శాతం తృణధాన్యాలను ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తపోటు, ఒత్తిడుల నుండి దూరంగా ఉండవచ్చు.

Thursday, October 16, 2014

ముఖం పై నలుపు తగ్గించే టమాటో ..tomato for face pack.

1. తాజా టమాటో  మద్య లో కోసి ఆ ముక్కని పంచదార లో అద్దాలి . దాని పై కొద్దిగా చిక్కని పెరుగు వేసి , దాంతో ముఖం రాసుకుంటే మృత కణాలు తొలిగిపోతాయి . ముఖం పై నలుపు నెమ్మది గా తగ్గిపోతుంది .

2. ఒక ముక్క టమాటో  రసం , ఒక ముక్క నిమ్మరసం కొద్ది గా పెరుగు కలిపి మిశ్రమం లా చేసుకోవాలి . మరీ పల్చగా ఉంటె శనగపిండి కాని ముల్తానీ మట్టి కాని కలిపి చిక్క గా చేసుకోవచ్చు . ఈ మిశ్రమాన్ని ముఖం , మెడ వంపు ల్లో ప్యాక్ లా రాసుకోవాలి .  ఇలా వారం లో రెండు సార్లు చేస్తే ట్యాన్ తోలిగిపోతుంది . చర్మం తాజా గా మారతుంది . మొటిమల సమస్య తగ్గుతుంది .

3. ఒక ముక్క టమాటో  రసానికి చెంచ కోతిమీర రసం కలిపి , దానికి కొంచం ముల్తాని మట్టి కలిపి ముఖాని కి ప్యాక్ వేసుకోవాలి . ఆరిన తరవాత కడిగేస్తే మంచి గ్లో వస్తుంది

Saturday, October 11, 2014

బాదంతో అందం

- రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడిని పాలల్లో వేసి కలపాలి. చిక్కటి పేస్ట్‌లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి.
 ఈ పేస్ట్‌ను నిద్రపోయే ముందు ముఖానికి ఐప్లె చేయాలి. 10-15నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

-ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్‌లో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
-బాదంను నీళ్ళలో నానబెట్టి తర్వాత రోజు ఉదయం వాటి పొట్టు తీసి గ్రైండ్ చేయాలి. దాంట్లో తేనె మిక్స్ చేసి ముఖానికి, శరీరానికి పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె మిక్స్ చేయడం వల్ల ముఖంలో ఏర్పడ్డ మచ్చలు చాలా తేలికగా తొలగిపోతాయి.

-మెత్తగా పౌడర్ చేసిన ఓట్స్‌కు కొద్దిగా బాదం పొడి, రెండు టీస్పూన్ల పచ్చిపాలు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. డ్రై స్కిన్ కలిగిన వారికి ఈ ఫేస్ మాస్క్ బాగా పనిచేస్తుంది.
-బాదం నూనెను ముఖానికి, శరీరానికి పట్టించి మసాజ్ చేయాలి. అరగంట అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి.

బ్లాక్‌హెడ్స్‌కి ...health tips for black heads


1. ముల్లంగి విత్తనాలను పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 

2. చందనంలో రోజ్‌వాటర్ కలిపి ముఖానికి ఐప్లె చేసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

3. బేకింగ్‌సోడాకు, డెడ్‌సీ సాల్ట్, వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీంతో చర్మంపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

4. ఓట్‌మీల్ పౌడర్‌కు రోజ్‌వాటర్ కలుపుకొని ఆ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని 
నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

5. మెంతి ఆకులను పేస్ట్ చేసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగాలి. ఇలా తరచుగా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి.

6. పెరుగులో నల్లమిరియాల పొడివేసి, బాగా కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

7. దాల్చినచెక్క పొడి, నిమ్మరసం పేస్ట్‌ను రాత్రి బ్లాక్‌హెడ్స్‌పై రాసి ఉదయాన్నే కడిగేస్తే సరి!

ఇలా చేస్తే 80 శాతం మీ గుండె సేఫ్! health tips for heart

ఆధునిక జీవనశైలితో కంప్యూటర్లకు అతుక్కుపోవడంలో బిజీ ఉన్నప్పటికీ పనిచేసే చోట కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని కల్పించుకోవచ్చు. గుండెజబ్బులను నివారించాలంటే శారీరక శ్రమ అన్నది అత్యంత ముఖ్యమైన అంశo 
80 శాతం రిస్క్ తగ్గే మార్గం!

జాగ్రత్తలు - సూచనలు

-ప్రపంచవ్యాప్తంగా పొగాకును నిషేధించాలి. పొగాకు సంబంధిత అలవాట్లయిన సిగరెట్లు, బీడీలు, గుట్కాల వంటి అలవాట్లు లేకపోతే గుండెపోట్ల అవకాశాలను 36 శాతం తగ్గించుకోవచ్చు. 
-వారానికి కనీసం 5 రోజులన్నా తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. రోజుకి కనీసం 40 నిమిషాల పాటైనా వ్యాయామం చేస్తే గుండెపోటు అవకాశం 3 శాతం వరకు తగ్గుతుంది. సాధారణ వాకింగ్ అయినా చేయవచ్చు.



-స్థూలకాయం గుండెజబ్బులకు ప్రధాన శత్రువు. అందుకే నడుము చుట్టుకొలత 37 అంగుళాల కన్నా తక్కువ ఉంచుకోగలిగితే 12 శాతం రిస్కు తగ్గుతుంది. 
-కూరగాయలు, పండ్లు, గింజలు, ముడి ధాన్యాలు, చేపలను తీసుకుంటే 18 శాతం అవకాశాలు తగ్గుతాయి. చేపలు తప్ప ఇతర మాంసాహారాన్ని తగ్గించాలి. 
-రోజుకి కేవలం 2 పెగ్గులు మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటే రిస్కు 11 శాతం తగ్గుతుంది. కాని మనదేశంలో 2008లో జరిగిన ఇంటర్ హార్ట్ అధ్యయనంలో ఆల్కహాల్ వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చని కూడా తెలిసింది. ఇదేకాకుండా ఈ ఆల్కహాల్ మొదలుపెడితే రెండు పెగ్గులతో ఆగకుండా దానికి పూర్తిగా బానిసలయ్యే ఉంది కాబట్టి తీసుకోకపోవడమే మంచిది. 


పొద్దున్నే గుండెపోట్లు ఎందుకు?

నిద్రలోనే చనిపోయారనో, తెల్లవారుజామునే గుండెపోటు వచ్చిందనో అన్న మాటల్ని వింటూనే ఉంటాం. నిజమే ఉదయాన్నే గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా పొద్దున 4 నుంచి 8 గంటల మధ్య ఎక్కువమందిలో గుండెపోటు రావడం చూస్తుంటాం. ఈ సమయంలో శరీర పరిస్థితులు కూడా గుండెపోటు అవకాశాన్ని పెంచుతాయి. బయలాజికల్ సైకిల్‌లో భాగంగా ఈ సమయంలో శరీరంలోని హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించే కారకాలు (క్లాటింగ్ ఫ్యాక్టర్స్), ప్లేట్‌లెట్లు మందంగా అవుతాయి. కాబట్టి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి రక్తప్రసారానికి అంతరాయం కలిగే అవకాశాలు ఎక్కువ. రసాయనాలు అసమతుల్యత ఎక్కువ. బీపీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో గుండెపోటుకు గురయ్యే రిస్కు ఎక్కువ అవుతుంది. అందుకే బీపీ, కొలెస్ట్రాల్, స్టాటిన్స్ మందులు రాత్రిపూట మర్చిపోకుండా తప్పనిసరిగా వేసుకోవాలి. 


గుండెపోటు వస్తే..?

గుండెపోటు వచ్చినప్పుడు ఆందోళన పడకుండా అందుకు ఏం చేయాలన్నది ఆలోచించడం అన్నింటి కన్నా ముఖ్య విషయం. ఆందోళన పడితే సమస్య మరింత జటిలం అవుతుంది. అందువల్ల గుండెపోటు వచ్చిన మొదటి గంట లోపే డాక్టర్‌ను కలవడం అవసరం. పేషెంటు స్థితిని బట్టి ఆస్ప్రిన్, స్టాటిన్ లాంటి మందును ఇస్తారు. అలాగని ఇంటి దగ్గరే ఏ ఆస్ప్రిన్‌నో వేసుకునే ప్రయత్నం చేయవద్దు. కొందరిలో ఇది తీవ్రమైన దుష్ప్రభావాలు చూపించే ప్రమాదం ఉంది. అత్యవసర పరిస్థితిలో సార్బిట్రేట్ నాలుక కింద పెట్టుకుంటే వెంటనే రక్తనాళాలు కొంచెం తెరుచుకుని రక్తప్రసరణ జరుగుతుంది. అయితే అది కచ్చితంగా గుండెపోటు అని తెలిసినప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. లేకుంటే దీనివల్ల కూడా దుష్ప్రభావాలు ఉంటాయి. స్పృహ తప్పొచ్చు కూడా. అందువల్ల వీలైనంత తొందరగా వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.




క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ..health tips to avoid cancer

ఆధునిక జీవనశైలి కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ప్రేరేపిస్తుందనడం వాస్తవం. అందుకే మన అలవాట్లు, ఆహార విధానాలు మార్చుకుంటే క్యాన్సర్ రాకుండా కొంతవరకు నివారించవచ్చు. అందుకే మీరు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఈ అయిదు రకాల పదార్థాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు నిపుణులు.


1. ప్రాసెస్ చేసిన పదార్థాలు 

అందమైన కవర్లలో ప్యాక్ చేసి ఆకర్షణీయంగా కనిపించే రెడీమేడ్ ఆహార పదార్థాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిలో కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారు చేసిన ఫ్లేవర్లు, ఉప్పు, చక్కెర, కృత్రిమ చక్కెర పదార్థాల లాంటివి ఎన్నో కలుపుతారు. ఉప్పు ఎక్కువగా ఉన్నవి, ఊరేసినవి, నిలవ చేసిన పదార్థాల వల్ల జీర్ణకోశ క్యాన్సర్ అవకాశాలు పెరుగుతాయి. కేవలం ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలే జీర్ణకోశ క్యాన్సర్ అవకాశాన్ని 10 శాతం పెంచుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. కృత్రిమ రంగులు, అడిటివ్స్ కూడా హానికరమేనని తేలింది. 


2. రెడ్‌మీట్, ప్రాసెస్ చేసిన మాంసం 

రెడ్‌మీట్ ఎక్కువగా తినేవారిలో పెద్దపేగు, జీర్ణకోశ క్యాన్సర్ల అవకాశం ఎక్కువ. ప్రాసెస్ చేసి రెడీ టు ఈట్ గా తయారుచేసిన మాంసాహారంలో సోడియం నైట్రైట్, సోడియం నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి న్రైటొసమీన్స్‌గా మారి క్యాన్సర్ అవకాశాన్ని పెంచుతాయని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది. రోడ్డుమీద కాల్చి అమ్మే మాంసాహార పదార్థాలు కూడా తినకూడదు. 


3.చక్కెర 

చక్కెర వల్ల క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతాయని అంటుంటారు. అందుకే క్యాన్సర్ పేషెంట్లు తియ్యగా ఉంటాయని పండ్లు కూడా తినక అవసరమైన పోషకాలను పొందలేరు. నిజానికి దీనికి స్పష్టమైన రుజువులేమీ లేవు. అయితే చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కేలరీలు పెరిగి ఊబకాయం తద్వారా హార్మోన్లలో తేడాలు వస్తాయి. ఫలితంగా రొమ్ము, పెద్దపేగు, గర్భసంచి క్యాన్సర్ల అవకాశాలుంటాయి


4. వేపుళ్లు, చిప్స్

చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు. ఇలాంటి స్నాక్స్‌లో అక్రిలమైడ్ అనే క్యాన్సర్ కారకం ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల్లో (250 డిగ్రీ ఫారన్‌హీట్) వేడిచేసినప్పుడు అంటే వేపుడు, బేకింగ్ లాంటివి చేసినప్పుడు ఆహారపదార్థాల నుంచి ఇది తయారవుతుంది. దీర్ఘకాలం పాటు అక్రిలమైడ్‌కి ప్రభావితం కావడం వల్ల ఎలుకల్లో కణుతులు ఏర్పడినట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇటువంటి ఆహార పదార్థాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌ల అవకాశం పెంచడంతో పాటు క్యాన్సర్ కారకాలు కూడా. 


5. ఆల్కహాల్

ఆల్కహాల్ తీసుకోవడానికి క్యాన్సర్‌కి సంబంధం ఉందని అనేక రకాల రుజువులున్నాయి. నోరు, గొంతు, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్లే కాకుండా రొమ్ము క్యాన్సర్‌కి కూడా ఇది దోహదం చేస్తుంది.

నీళ్ళతో ..health tips using water

దాహం వేస్తే నీళ్లు తాగడం కాదు. మన చర్మం, కళ్లు, జుత్తు, గోళ్లు.. ఇలా ఒకటేమిటి..! శరీరంలోని ఏ భాగం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తగినన్ని నీళ్లు తాగాల్సిందే. ఉదయాన్నే గోరువెచ్చని నీరు, నిమ్మరసం తాగితే రోజంతా ఉల్లాసంగా ఉండడమే కాకుండా సవాలక్ష అనారోగ్యాలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. 


డీహైడ్రేషన్


మొటిమలు


నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని హానికర మలినాలన్నీ వెళ్లిపోతాయి కాబట్టి మొటిమల అవకాశం తగ్గుతుంది. 

సన్‌బర్న్


సన్‌బర్న్ బాధల్ని నీరు తగ్గిస్తుంది. నీరసపడిన శరీరానికి పునరుత్తేజాన్నిస్తుంది. 

కళ్ల కింద సంచులు


డీహైడ్రేషన్ వల్ల కంటి కింద ఉండే సున్నితమైన చర్మం దెబ్బతిని సంచుల్లా పెరగడానికి దోహదం చేస్తుంది.

ముక్కు పొడిబారడం

నీళ్లు తగినన్ని తాగితే పొడి వాతావరణంలో కూడా ముక్కు పొడిబారిపోయి, ఎర్రగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. 

హైడ్రేషన్

ఆరోగ్యకరమైన తల (మాడు)

తల మీద అకారణంగా దురద పెడుతూ ఉందంటే తల పైన చర్మం పొడిబారిపోయినట్టే. ఇలాంటప్పుడు నీళ్లు ఇంకా ఎక్కువగా తాగాలి. 

బలమైన జుత్తు, గోళ్లు

సాధారణంగా శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. జుట్టు పొడిబారిపోయినట్టు కనిపిస్తున్నదంటే మీరు తాగుతున్న నీళ్లు సరిపోనట్టే. రోజూ 8 గ్లాసుల నీరు తాగాలి. 

మెరిసే కళ్లు

డీహైడ్రేషన్ వల్ల పొటాషియం ఎలక్ట్రొలైట్స్ మోతాదు తగ్గుతుంది. వీటివల్లనే కళ్లకి కావాల్సిన తేమ అందుతుంది. అందువల్ల డీహైడ్రేషన్ అవకుండా తగినన్ని నీళ్లు తాగితే కళ్లలో మెరుపు వస్తుంది. 

బరువు తగ్గడం

భోజనానికి 20 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగితే బరువు తగ్గుతారు.

ముడతలు లేని చర్మం

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం స్థితిస్థాపకత పెరుగుతుంది. తద్వారా ముడతలు తగ్గుతాయి.

పెదాలు మెరవాలంటే TIPS FOR LIPS

1. రాత్రి నిద్రపోయే ముందు తేనె ని పేదలకి రాసుకోవాలి . ఉదయం లేవగానే మామూలు నీళ్ళతో కడిగేయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే పెదవులు మృదువుగా , గులాబీ రంగు లోకి మారుతాయి

2. నిమ్మ ముక్కతో కాని ఐస్ ముక్కతో కాని పెదాలని  మర్దన చేసిన మంచి ఫలితం ఉంటుంది .

3. బాదం నూనె , ఆముదం కలిపిన మిశ్రమంతో పెదాలని మర్దన చేసిన పెదాల రంగు మారతుంది .

4. 5 నుంచి 6 చుక్కల ఆలివ్ నునె లో ఒక స్పూన్ పంచదార కలిపి పెదాలపై రుద్దాలి .

5. పెట్రోలియం జెల్లీని కాని అలోవెర జెల్లీని కాని పెదాలపై రాసుకుంటే పెదవులు మృదువు గా తయారవుతాయి 

Monday, September 29, 2014

ఆకాకరకాయలతో ఆరోగ్యం



1. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది . 

2. ఇందులో పీచు , యాంటి ఆక్సిడెంట్ ,విటమిన్స్ పుష్కలం 

3. దీనిలోని ఫోలేట్ లు శరీరం లో కొత్త కణాల వృద్ధి కి గర్భస్థ శిశువు ఎదుగుదల కి ఉపయోగపడతాయి 

4. రక్తం లో ఇన్సులిన్ స్థాయి పెంచి మధుమేహం తో బాధపడే వారికి మేలు చేస్తుంది 

5. ఇందులోని ఫైటో న్యూట్రి యాంట్స్ కాలేయానికి కండరాల కి బలాన్ని ఇస్తుంది. 

6. శరీరం లో ఏర్పడే కాన్సర్ కారకాలని నాశనం చేస్తుంది 

7. దీనిలో విటమిన్ ఎ , విటమిన్ సి , ప్లవనాయిడ్స్ సమృద్ది గా లభిస్తాయి 

8. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వీటిని ఎక్కువ తీసుకుంటే మంచిది 

Wednesday, September 17, 2014

తలకి తైల మర్దనతో లాభాలు ..head massage tips


1. గోరు వెచ్చటి నూనెని మాడుకు పట్టించి మునివేళ్లతో నెమ్మదిగా మర్దన చేయాలి. పదిహేను నిమిషాలు మర్దన చేయడం వల్ల మాడుకు రక్త సరఫరా బాగా అవుతుంది. 

2. రాత్రి నూనె పెట్టుకుని మరుసటి రోజు తలస్నానం చేస్తే ఫలితం బాగుంటుంది. ఒకవేళ పగలు పెట్టుకుంటే మాత్రం రాత్రికి తలస్నానం చేయాలి. ౨౪ గంటలకంటే ఎక్కువసేపు తల మీద నూనె ఉంచుకోవద్దు. 

3. నూనె పెట్టిన తరువాత వేడి నీళ్లలో ముంచిన టవల్‌ను తలకు చుట్టి పదినిమిషాలు ఉంచాలి. 

4.నార్మల్ హెయిర్.. జిడ్డుగా లేదా పొడిగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు జొజొబా, బాదం, ఉసిరి నూనెలు వాడాలి. 

5.నిస్సారంగా కనిపించేది పొడిజుట్టు. ఇది త్వరగా చిట్లిపోతుంది. బాదం, జొజొబా, కొబ్బరి, నువ్వులు, ఆవాలు, కోకో-బటర్ నూనెలు వాడితే బెటర్. 

6.జిడ్డు జుట్టుకి ఆలివ్, నువ్వులు, జొజొబా నూనెలు పెట్టుకోవాలి. 

7.చుండ్రు ఉంటే.. టీ ట్రీ నూనె చాలా బాగా పనిచేస్తుంది. 

8.ఏ నూనె వాడుతున్నా అందులో విటమిన్-ఇ కలిపి వాడితే జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది. 

తల్లిపాలతో బిడ్డకి ఆరోగ్యం

తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఇప్పుడు డబ్బా పాలైపోయింది. డబ్బా పాల వ్యాపారం బాగా ఎక్కువైపోతోంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పిల్లలకు తల్లిపాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

1. ప్రసవానికి ముందుగానీ, ప్రసవం తర్వాత గానీ తల్లి ఎటువంటి మానసిక ఆందోళనలకు గురికాకూడదు. పూర్తిగా, విశ్రాంతిగా, ఉల్లాసంగా ఉండాలి. గర్భిణిగా ఉన్నప్పుడు జంక్‌ఫుడ్స్‌ జోలికి వెళ్లకుండా పోషకపదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

2. అప్పటికీ పాలు పడకపోతే...ప్రసవించగానే తల్లికి బ్రెడ్‌, పాలు ఆహారంగా ఇవ్వాలి.

3. వెల్లుల్లి ధనియాలను పొడిచేసి దానికి తగినంత ఉప్పు, కారం కలిపి అన్నంలో కలుపుకుని తినాలి.

4. జీలకర్రను దోరగా వేయించి మెత్తటి పొడిచేసి ఆవునెయ్యి కలుపుకుని తినాలి.

5. వామును పెనంపై నల్లగా మాడ్చి మెత్తగా పొడిచేసి, చిటికెడు పొడిని అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కలుపుకుని తినాలి. నెయ్యి వేసుకోవడం కూడా ముఖ్యమే.

6. శొంఠిపొడిని, బెల్లమును 1:4 నిష్పత్తిలో కలుపుకొని, చిన్నచిన్న ఉండలను రోజూ రెండుపూటలా తినాలి.

7. బార్లీ గింజలను పాలలో మెత్తగా మరిగించి దానికి చక్కెర కలిపి ఆ పాలను తాగాలి.

చర్మం మెరవటానికి ..tips for glowing skin


చర్మంలో మృతకణాలు ఎక్కువగా చేరే కాలమిది. అందువల్ల ముఖంలో కాంతి తగ్గుతుంది. ఆ సమస్య నుండి బయటపడాలంటే...

1. రెండు చెంచాల నిమ్మరసానికి కొద్దిగా ఆలివ్‌నూనె, తేనెతో పాటూ అరచెంచా పంచదార కలిపితే గరుకైన మిశ్రమం తయారవుతుంది. దాన్ని సున్నితంగా ముఖానికి మర్దన చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోవడంతో పాటూ చర్మానికి తేమ అంది కాంతులీనుతుంది.

2. పెద్ద చెంచా బొప్పాయి గుజ్జుకి అరచెంచా తేనె కలిపి వీటికి తగినంత పంచదార కలపాలి. ఆ మిశ్రమంతో గరుకుగా మారిన చోటల్లా మర్దన చేస్తే చర్మం తాజాగా మారుతుంది.

3. బేకింగ్‌ సోడాకి తగినన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమంతో కొన్ని నిమిషాల పాటు రుద్దాలి. అలాచేస్తే మృతకణాలు తొలగిపోతాయి. ఆ పై ముఖానికి బాగా పండిన అరటిపండు గుజ్జుకి కొద్దిగా పెరుగు, చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించి చూడండి. ముఖం నిగనిగలాడుతుంది.

4. పావుకప్పు పచ్చిపాలు తీసుకుని దానికి చెంచా తేనె కలపాలి. ఆ మిశ్రమానికి పంచదారని కలిపి ముఖానికి రుద్దినా మంచి ఫలితం ఉంటుంది.

5. కేరట్‌ గుజ్జు కూడా ఈ చల్లటి సీజన్‌లో చక్కగా ఉపయోగపడుతుంది. మెత్తగా ఉడికించిన గుజ్జుకి కొద్దిగా పంచదార కలిపి ఆ మిశ్రమంతో రుద్దితే మృతకణాలు తొలగిపోవడమే కాదు. చర్మానికి కావాల్సినంత పోషకాలూ అందుతాయి.

6. జీలకర్రని వేడినీళ్లలో వేసి ఉడికించాలి. ఈ నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

7. రెండు స్పూన్ల గోధుమపిండి, కప్పు పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత స్క్రబ్‌తో శుభ్రం చేయాలి. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

8. చర్మానికి అప్పటికప్పుడు మెరుపు రావాలంటే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చేసి కాసేపయ్యాక కడిగేయాలి. 

9. కమలాపండుని రెండుగా కత్తిరించి దాంతో చర్మంపై మృదువుగా రుద్దండి. ఇలా రోజూ చేస్తే నెల రోజుల్లో మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది!

ఆరటి తో లాభాలు health tips using banana


1. డిప్రెషన్‌తో బాధపడేవారు ఒక అరటిపండు తింటే ఫీల్‌గుడ్‌ ఫీలింగ్‌ వస్తుందని ఒక పరిశోధన ఫలితం.

2. అరటిలో ఉండే బి6 విటమిన్‌కు రక్తంలో చక్కెరస్థాయిల్ని నియంత్రించే శక్తి ఉంది.

3. పరిశోధనలో భాగంగా మిడిలెసెక్స్‌లోని ఒక పాఠశాలలోని విద్యార్థులతో సంవ త్సరం పాటు రోజుకు 3అరటిపండ్లు తినిపించారు. అందులో ఉండే అధిక పొటాషియం కారణంగా విద్యార్థులంతా చురుగ్గా తయారయ్యారని రీసెర్చిలో తేలింది. హేంగోవర్‌తో తలబద్దలైనట్టు అనిపిస్తోందా! డోంట్‌వర్రీ, ఓ గ్లాసుడు బనానా మిల్క్‌షేక్‌తో కాసింత తేనె కలిపి తాగి చూడండి.

4. అరటిపండ్లు సహజ ఏంటాసిడ్స్‌లా పనిచేస్తాయి.

5. దోమలో,చీమలో కుడితే అరటితొక్క లోపలి భాగాన్ని అక్కడ రుద్ది చూడండి. మంట, దురద మటుమాయం.

6. అరటిపండులో పీచుపదార్థం ఎక్కువ. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

7. రెండు అరటిపండ్లు తింటే చాలు గంటన్నరపాటు పనిచేసుకోవడానికి శక్తి సమకూరినట్టే

మేకప్ మెళకువలు tips for makeup

 మేకప్‌ టిప్స్‌ మీకోసం...
డార్క్‌ కలర్స్‌ వాడకండి

- మేకప్‌ చేసుకునేటప్పుడు కళ్లచుట్టూ ఉన్న ముడతలు కనపడకుండా చేయటానికి డార్క్‌ కలర్‌ 'ఐషాడో వాడకండి. దీంతో ముడతలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి బదులు మ్యాట్‌ కలర్‌ 'ఐ షాడో వాడండి. ఈ కలర్‌తో ముడతలు, డార్క్‌ సర్కిల్స్‌ తక్కువగా కనపడతాయి.

లిప్‌ కలర్‌

- వయసు పెరుగుతున్న కొద్దీ పెదవులు పగలటం, పొడిబారటం ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు డార్క్‌, కలర్‌ లిప్‌స్టిక్‌ బదులు లైట్‌ కలర్‌ వాడండి. డార్క్‌, షేప్‌ లిప్‌ లైనర్‌ వాడకండి. దీనికి బదులు లిప్‌గ్లాస్‌ ఉపయోగించకండి.

కలర్స్‌ జాగ్రత్తగా ఎంచుకోవాలి
- బుగ్గలపై బ్రైట్‌ పింక్‌ వాడుతున్నట్లయితే పెదవులపై ఏమీ పెట్టుకోవద్దు. కళ్లకు ప్రత్యేక మేకప్‌ వేసుకున్నప్పుడు మిగిలిన భాగాలను సింపుల్‌గా వదిలేయండి.

ఫౌండేషన్‌తో కవర్‌ చేయండి

- ముఖంపై మచ్చలు, గుర్తులుంటే వాటిని  ఫౌండేషన్‌తో కవర్‌ చేయండి. అయితే ఫౌండేషన్‌ ఎక్కువగా వాడితే ముఖంపై ముడతలు కనిపిస్తాయి. కాబట్టి ఫౌండేషన్‌ వేసుకోవడానికి ముందు మాయిశ్చరైజర్‌ తప్పకుండా రాయండి. దీంతో ఫౌండేషన్‌ ముఖమంతా సమంగా పరచుకుంటుంది.

కళ్లలో డల్‌నెస్‌ పోవడానికి...

- కళ్లలో మెరుపు నిలిపి ఉంచడానికి కలర్‌ఫుల్‌ లెన్స్‌ వాడొచ్చు. అలాగే కళ్లకు కాటుక పెట్టుకోవచ్చు. 'ఐ లైనర్‌ పెట్టుకుంటే కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. దీనికోసం బ్రౌన్‌ లేదా బ్లాక్‌ కలర్‌ 'ఐ లైనర్‌ వాడవచ్చు. మీ కనుబొమ్మలు సన్నగా ఉంటే వాటికి బ్లాక్‌ కలర్‌ 'ఐ బ్రో పెన్సిల్‌తో సరైన ఆకృతి ఇవ్వవచ్చు.  

Monday, September 15, 2014

ఉలవలతో ఆరోగ్యం

1. స్థూలకాయం

ఉలవలను ఆహారరూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీకడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది.
2. బోదకాలు, కాళ్లవాపు

ఉలవల పిండినీ, పుట్టమన్నునూ ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకుని సమంగా కలిపి కోడిగుడ్డు తెల్లసొనను కలిపి స్థానికంగా లేపనం చేసే హితకరంగా ఉంటుంది.
3. కాళ్లుచేతుల్లో  వాపులు, నొప్పి

ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనం మీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి.
4. శరీరంలో వ్రణాలు తయారవటం

పావుకప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావ్ఞ టేబుల్‌స్పూన్‌ అల్లం ముద్దను, పావ్ఞ టేబుల్‌స్పూన్‌ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటికి కలిపి ఉడికించి, తేనె కలిపి కనీసం నెలరోజుల పాటు తీసుకుంటే బాహ్యంగా అభ్యంత రంగా తయారైన వ్రణాలు (అల్సర్లు) త్వరితగతిన తగ్గుతాయి.
5. మూత్రంలో చురుకు, మంట

ఒక కప్పు ఉలవచారుకి సమానభాగం కొబ్బరినీరు కలిసి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవ్ఞతుంది.
6. మధుమేహం

మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంతో వెంపలి(శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది.
8. సెగగడ్డలు

ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపు పొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మం మీద తయారైన సెగగడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. ఉలవలతో కులత్థాద్యఘృతం, కులత్థాది ప్రలేపం, కులత్థయూషం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవ్ఞతాయి. ఉలవల్లో ప్రొటీన్‌ ఎక్కువ. పెరిగే పిల్లలకు టానిక్‌. ఉలవల్లో ఐరన్‌, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
9. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు. 
10. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి. 
11. ఉలవలను తీసుకోవటం వల్ల మలనిర్వహణ సజావుగా, సాఫీగా జరుగుతుంది. ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది. 
12. మహిళల్లో బహిష్టు రక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి సైతం హితం చేస్తాయి.

Saturday, September 13, 2014

నలుగుతో స్నానం చేస్తే...! health tips to bath

1. వారానికోసారి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి.  అయితే ఆ ప్రక్రియను హడావుడిగా ముగించకూడదు. చాలా నెమ్మదిగా, సున్నితంగా చేయాలి. అప్పుడే మృతకణాలు పూర్తిగా తొలగిపోతాయి

2. చర్మం పొడిగా ఉన్నప్పుడు నలుగు పెట్టుకోకూడదు. స్నానానికి అరగంట ముందు చక్కగా నూనె రాసుకుని ఇరవై నిమిషాలయ్యాక తడిపొడిగా ఉన్న చర్మానికి నలుగుపిండి పెట్టుకుని రుద్దుకోవాలి

3. మెడ దగ్గర బరబరా రుద్దుకోకూడదు. చాలా నెమ్మదిగా మర్దనా చేయాలి. మెడభాగం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి రెట్టింపు జాగ్రత్త అవసరం

4. మృతకణాలు సులువుగా తొలగిపోవాలంటే...క్రమపద్ధతిలో నలుగుపెట్టుకోవాలి. అంటే నలుగురాసుకుని సవ్య, అపసవ్య దిశలో వేళ్లచివర్లతో మర్దనా చేయాలి. లేదంటే మార్కెట్‌లో లభిస్తున్న లూఫా ఒకటి కొనండి చాలు.   

చర్మం పై జిడ్డు ని వదిలించండి ఇలా health tips for oily skin

1.రోజుకు మూడు సార్లు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

2. అవసరమైతే మూలికల చూర్ణాన్ని వాడితే మంచిది. ఇవి చర్మంమీద మృతకణాలను సురక్షితంగా తొలగిస్తాయి. మురికి విషతత్వాలు, కాలుష్యం వల్ల పేరుకు పోయిన వ్యర్థాలు వంటివాటిని కూడా ఈ చూర్ణాలు తొలగించి ముఖ చర్మాన్ని కాంతి వంతంగా కనిపించేలా చేస్తాయి

3. పసుపుకు నిమ్మరసం చేర్చి చర్మం మీద ప్రయోగిస్తే జిడ్డు తనం వంటివి తొలగిపోతాయి

4. లొద్దుగ, తులసి, జాజికాయ, వేపబెరడు, తెల్లమద్ది, త్రిఫలాలు, తుంగ ముస్తలు, కస్తూరి పసుపు వంటివాటిని నేరుగా గాని లేదా ఆవ నూనెలో కలిపిగాని వాడవచ్చు

మంచి నిద్రకోసం చిట్కాలు health tips for good sleep

కారణాలు మరియు నివారణలు 

1. చాలామందికి నిద్ర సరిగా పట్టదు. ఇందుకోసం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటే మంచిది. టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే మానేసి గ్రీన్‌ టీ అలవాటు చేసుకోవాలి

2. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్‌ నిద్రని దూరం చేస్తుంది. వేడివేడి గ్రీన్‌ టీలో థియనైన్‌ అనే అమినో ఆమ్లం చక్కగా నిద్రపట్టడానికి సహకరిస్తుంది. 

3. రాత్రి పడుకునే ముందు పాలు తాగినా నిద్ర బాగా పడుతుంది. 

4. మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం అయ్యాక అరటి పండు, యాపిల్‌ తినడం అలవాటుచేసుకుంటే మంచిది. ఇవి రాత్రి పడుకున్నాక చక్కెరస్థాయిలు పడిపో కుండా చూసి,చక్కగా నిద్రపోయేలా చేస్తాయి. 

5. ఎండు ద్రాక్ష, బాదం వంటి నట్‌లు తింటే మెగ్నీషియం ఒంట్లో చేరుతుంది. ఈ మూలకం నిద్రకి సహకరిస్తుంది. 

6. క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తిన్నానిద్రపడుతుంది. నట్‌లూ, గుడ్లూ నిద్ర పట్టేందుకు తోడ్పడతాయి.

పొట్ట తగ్గించుకోవడం మన చేతుల్లోనే! health tips for belly redction

కారణాలు మరియు నివారణలు 

1. పొట్ట పెరిగేందుకు దోహదం చేసే ఆహారంలో ముఖ్యంగా తెల్లని బియ్యం కారణంగా ఉదరభాగం ఉబ్బుగా మారే అవకాశాలు బాగా ఎక్కువ.కాబట్టి దానికి బదులుగా గోధుమలు, దంపుడు బియ్యం, జొన్నలు, కొర్రబియ్యం...వంటివి వాడడం మొదలు పెట్టాలి

2. చిన్న చిన్న పరిమాణాలలో పలు దఫాలుగా ఆహారం తీసుకునే వేళలు సవరించుకోవాలి. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ కాస్త ఎక్కువగా తీసుకన్నా పర్లేదు. అక్కడి నుంచి తగ్గిస్తూ వెళ్లాలి. రాత్రి 7-8గంటల లోపు తినే కార్యక్రమం ముగించడం అవసరం

3. అలాగే నిద్రపోయే వేళలు కూడా వీలున్నంత వరకూ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పైవన్నీ కనీసం 6వారాల పాటు క్రమం తప్పకుండా పాటించాలి. 

4. ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పుచేర్పులు చేయకుండా పొట్ట తగ్గించడం అసాధ్యం. ఆహారపు అలవాట్లు మార్చకుండా జిమ్‌లకు పరిగెడితే...అదనపు శారీరక శ్రమ వల్ల మనకు తెలీకుండానే మనం అదనంగా తింటాం. దాంతో పొట్ట తగ్గే అవకాశాలు మరింత తగ్గుతాయి. అందుకని ముందుగా పొట్ట పెరిగేందుకు దోహదం చేస్తున్న ఆహారాన్ని త్యజించాల్సిందే.

5. అవసరమైన షూస్‌, తగిన డ్రెస్‌ సిద్ధం చేసుకుని వాకింగ్‌ మొదలుపెట్టాలి. ప్రారంభంలో ఉదయం పూట కనీసం 20 నిమిషాలు తరువాత దశలవారీగా దాన్ని 40-60 నిమిషాల దాకా తీసుకెళ్లాలి

6.  సాధారణ వాకింగ్‌ రెండు వారాల పాటు మానకుండా చేశాక బ్రిస్క్‌ వాకింగ్‌ మొదలుపెట్టాలి. ఆ తర్వాత వాకింగ్‌, బ్రిస్క్‌వాకింగ్‌ కలిపి చేయాలి. మరో 2 వారాలు గడిచాక నిపుణుల పర్యవేక్షణలో అబ్డామినల్‌ క్రంచెస్‌ ప్రారంభించాలి. వీటిలో విభిన్న రకాలున్నాయి

7. వీటితో పాటుగా సైడ్‌ బెండ్స్‌, యోగాసనాలు, లైట్‌ వెయిట్స్‌తో స్ట్రెంగ్త్‌ ట్రయినింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ వంటివి కూడా వీలుని బట్టి అపుడపుడు జతచేస్తుండాలి. రోజుకి 30 నిమిషాలతో ప్రారంభించి గంట, గంటన్నర దాకా సమయాన్ని పెంచాలి. ఇలా 3నెలలు చేశాక , మెరుగైన ఫలితాల కోసం ఎక్సర్‌సైజ్‌ రొటీన్‌లో అవసరమైన మార్పుచేర్పులు చేసుకోవాలి . 

8. శరవేగంగా మార్పును ఆశించవద్దు. అలాగే మొదట్లోలాగే త్వరగా బరువు తగ్గుతామని అనుకోవద్దు. లేదా కృత్రిమ పద్ధతుల్లో తగ్గించేసుకోవాలని ఆరాటం వద్దు. ఆహారపు అలవాట్లలో మార్పు చేర్పులను కొనసాగిస్తూ, వ్యాయామం చేస్తుంటే నిదానంగా పొట్ట కరగడం ప్రారంభిస్తుంది. 

9. అయితే ఒకసారి కరిగిన పొట్ట తిరిగి రాకుండా శారీరక శ్రమని దినచర్యలో భాగం చేయడం అవసరం. లిఫ్ట్‌ వాడకుండా మెట్లు ఎక్కి దిగడం, చిన్న చిన్న దూరాలకు నడిచి వెళుతుండడం, ఆఫీసు, ఇంట్లో ఇలా ఎక్కడైనా సరే శరీరం కదిలేలా చలాకీగా పనులు నిర్వర్తిస్తుండడం...వంటివి చేస్తూ ఉండాలి . 

10. అబ్డామినల్‌ వ్యాయామాలలో విభిన్న రకాలను సాధన చేయాలి. అలాగే వెల్లకిలా పడుకుని చేసే బైసికిల్‌ ఎక్సర్‌సైజ్‌ను అత్యుత్తమమైనదిగా అమెరికన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్థారించింది. 

11. ది ప్లాంక్‌ (పుషప్‌ చేయడానికి చేతులు నేలకు ఆన్చి అదే భంగిమలో నిశ్చలంగా ఉండిపోయే వర్కవుట్‌) అనే వెరైటీ వ్యాయామం కూడా పొట్ట భాగాన్ని చదును చేసేందుకు చక్కని మార్గం.   

పొడి చర్మం కోసం health tips for dry skin

1. ఆలివ్ నునె లో కొద్దిగా ఆముదం కలిపి ముఖానికి రాయాలి . ఆ  తర్వాత వేడి టవల్ ముఖం మీద ఉంచాలి . కాసేపటి తర్వాత కడిగేయాలి. దీనివల్ల చర్మం నునుపుగా, మృదువు గా మారుతుంది .

2. నారింజ రసం లో తేనె కలిపి ముఖానికి రుద్ది 10 నిమిషాల తర్వాత కడగాలి. ఇది ముడతలను పోగొడుతుంది

3. గ్రుద్దు లోని పచ్చసోన , నారింజ రసం , ఆముదం , ఆలివ్ ఆయిల్ ,తేనె , రోజ్ వాటర్ ,నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి .

4. కోకో పౌడర్ లో ,తేనె , మొక్కజొన్న పిండి ,అవోకాడో గుజ్జు కలిపి ముఖానికి రాయాలి . అరగంట తర్వాత గోరువెచ్చని నీటి తో కడగాలి. ఈ ప్యాక్ ముఖానికి మంచి గ్లో ఇస్తుంది

5. శనగ పిండి లో పసుపు , తేనె, పాలు , నిమ్మరసం కలిపి పేస్టు లా చేసుకోవాలి . దీనిని ముఖానికి  పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ మిశ్రమం ముఖాన్ని తేమ గా , ముడతలు తొలిగించడానికి ఉపయోగపడ్తుంది 

మెడ నొప్పి కారణాలు , నివారణలు health tips for neck pain

మెడ నొప్పి కారణాలు

1. చాలా సేపు కూర్చొని కంప్యూటర్ పై పని చేయడం , ఎతైన తల దిండు వాడటం , కుర్చీ లో  కూర్చొని నిద్ర పోవడం

2. మెడ కి దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రాంతం లో ఎముకలు బలహీనపడి , కొన్నేళ్ళ తర్వాత నొప్పి వస్తుంది.

3. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వల్ల

4. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల

నివారణలు

1. ప్రయాణాలు తగ్గించుకోవాలి . ఎత్తు పళ్ళాలు ఉన్న దారి లో ఎక్కవ ప్రయాణాలు చేయరాదు

2. ప్రతిరోజు మెడ కి సంబందించిన వ్యాయామం చేయాలి

3. సరైన పౌష్టిక ఆహరం , కాల్షియం , విటమిన్ డి అధికంగా ఉన్న పాలు , గ్రుడ్డ్లు ,పండ్లు ఎక్కవ తీస్కోవాలి

4.ఎతైన దిండు వాడకూడదు

5. కుర్చీ లో కూర్చొని నిద్ర పోకూడదు

6. ఎముకలను బలహీన పరిచే ధూమపానం , మద్యపానం మానెయ్యాలి. 

Tuesday, September 9, 2014

మెంతుల తో ఆరోగ్యం

1  ఇవి రక్తం లోని ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల ని తగ్గిస్తాయి

2  ఊపిరితిత్తుల కాన్సర్ రాకుండా కాపాడ్తుంది .

3  జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది

4. మలబద్దకాన్ని నివారిస్తుంది

5మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలాచేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది

Sunday, August 24, 2014

కళ్ళ కి తీసుకోవలిసిన జాగ్రత్తలు health tips for eyes

1. రోజ రెండు లీటర్ ల నీరు  త్రాగితే చర్మానికే కాదు కంటికి కూడా చాల మంచిది .

2. అతినీలలోహిత కిరణాలు కంటి మీద పడకుండా గ్లాసెస్ పెట్టుకోవాలి .
\
3. పడుకోబోయే ముందు కళ్ళ  మీద కీర ముక్కలు పెట్టకుంటే మంచిది .లేదా రోజ్ వాటర్ కాళ్ళ మీద జల్లుకున్న చల్లగా ఉంటుంది

4. ఒక గ్లాస్ నీటిలో ఉసిరిపొడి వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో కళ్ళను కడగాలి. దానివల్ల కళ్లు తాజాగా మెరుస్తాయి.

Friday, August 22, 2014

ఆరోగ్యానికి పండ్లు ... fruits for health

1. ద్రాక్ష పళ్ళు :

దీనిలో పోషక పదార్థాలు , యాంటి ఆక్సిడెంట్లు , పైటో కెమికల్స్ , ఫైబర్ వంటివెన్నో ఉన్నాయి . ఇవి గుండె జబ్బులు రాకుండా మరియు రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతాయి . రక్త పోటు ని నివారిస్తాయి .

2. ఆపిల్:

యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . డయాబెటిస్ పెరగకుండా నియంత్రిస్తుంది . ఆస్థమాని దరి చేరనివ్వదు . నోటి దుర్వాసన రాకుండా చూస్తుంది .

3. అవకడో పళ్ళు :

శరీరంలో కొవ్వు ని తగ్గిస్తాయి.

4.బ్లాక్ బెర్రీ :

ఉపిరితితుత్తుల కాన్సర్ ని అడ్డుకుంటుంది . గౌట్ లాంటి జబ్బులతో బాధపడేవారికి బాగా పనిచేస్తాయి.

5.అరటి పళ్ళు :

అరటి పళ్ళల్లో  ఎక్కువ పొటాషియం లభిస్తుంది . ఇది రక్తపోటు ని నివారిస్తుంది .

6. బ్లూ బెర్రీ :

ఇందులో పీచు , యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ శాతం ఉంటాయి. వృద్ధాప్యం లో వచ్చే పార్కిన్ సన్ , అల్జీమర్స్ వంటి జబ్బులని నియంత్రిస్తుంది .

7.చెర్రి :

దీనికి  ఆర్థ రైటిస్ ,గౌట్ వంటి నొప్పుల్ని తగ్గించే గుణం ఎక్కువ .

8.ఫీగ్ పండు :

దీనిలో పొటాషియం , ఐరన్ ,కాల్షియం ఎక్కువ లభిస్తాయి.

9. గోజి బెర్రీ :

దీనిని నుట్రియంట్ పవర్ హౌస్ అని పిలుస్తారు . ఇందులో 6 రకాల విటమిన్స్ ,20 కి పైగా ఖనిజాలు ,యాంటి ఆక్సిడెంట్లు ఉన్నాయి.ఇవి డయాబెటిస్ ని తగ్గిస్తాయి .

10. కివి పళ్ళు : 

ఇవి ఎముకలు బలంగా ఉండేటట్టు చేస్తాయి . ఆరోగ్యకరమైన దంతాలకు , చిగుళ్ళ కి ఉపయోగపడతాయి . గండే జబ్బులకి కారణమయ్యే ట్రై గ్లిజరైడ్స్ ని నియంత్రిస్తాయి .

11. మామిడి పళ్ళు :

వీటిని తింటే  ద్రుష్టి సమస్యలు తలెత్తవ్ .. అలాగే కండరాల క్షినతని తగ్గిస్తాయి .

12. ఆరెంజ్ : 

ఇందులో సి విటమిన్ ఉంటుంది . గర్బినిలకి చాల మంచిది .

13.దానిమ్మ:

గుండె కి ఎంతో మంచిది రోజు తింటే రక్త పోటు , గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ .

14. పైనాపిల్ : 

ఇది జీర్ణ శక్తి ని మెరుగు పరుస్తుంది . శరీరానికి తగిలిన గాయాలను తొందరగా మానేట్టు చేస్తుంది .

15. పుచ్చకాయ : 

ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది . బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడ్తుంది.

Tuesday, August 12, 2014

కేశ సంరక్షణ చిట్కాలు tips for hair growth and damage

1. తల స్నానం వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు చేస్తూ జుట్టు ని శుభ్రంగా ఉంచుకోవాలి .

2. వారానికి రెండు సార్లు అయిన తల నూనెతో మర్ధన చేసుకోవాలి.

3.వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి

4.ఎక్కువగా జుట్టు రాలుతుంటే  ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోని దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

5. జింక్‌, అత్యవసర ఫాటీ ఆమ్లాలను కలిగిన గుమ్మడికాయ గింజలు, వేరుశనగలు, కూరగాయ నూనెలు చుండ్రుని తరిమికొడతాయి.

6. రోజూ రెండు లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగటానికి ప్రయత్నించండి.

7.   దువ్వెనలను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, నీట్‌గా ఉంచుకోండి. వీలయితే మీ దువ్వెన సెపరేట్‌గా ఉంచుకోండి.  రెగ్యులర్‌గా హెయిర్‌ను బ్రష్‌ చేసుకోండి. 

8.  రెండు టీ స్పూన్లు వెనిగర్‌ తీసుకోండి. దాన్ని ఆరు టీస్పూన్ల వాటర్‌లో కలపండి. రాత్రి నిద్రబోయే ముందు తలకి అనగా నెత్తిమీద చర్మానికి రాయండి. ఆపైన తలంతా కవర్‌ అయ్యేలా కప్పి ఉంచుకోండి. ఉదయాన్నే తలను వాష్‌ చేసుకోండి. షాంపూతో స్నానం అయ్యాక వెనిగర్‌ నీళ్లతో మరోసారి వాష్‌ చేసుకోండి. ఇలా నెలకి నాలుగుసార్లు చేయండి

9. ఒక టీస్పూన్‌ నిమ్మపండు రసాన్ని రెండు టీస్పూన్ల వెనిగర్‌ని కలపండి. దానితో తలని మసాజ్‌ చేసుకోండి. పది చేతివేళ్లు జుట్టు మధ్యలో నుంచి తలపై నున్న చర్మానికి అంటు కునేలా చేతివేళ్ల చర్మంతో మసాజ్‌ చేసుకోండి. ఆ తర్వాత ఎగ్‌షాంపూతో తలస్నానం చేయండి.

10. ఆల్మండ్‌ నూనె టీస్పూన్‌, సల్ఫర్‌ పొడి ఒక టీస్పూన్‌, స్పిరిట్‌ రెండు టీస్పూన్లు, నాలుగు టీ స్పూన్ల నీరు లేదా రోజ్‌వాటర్‌ తీసుకుని కలపండి. కలిపిన దానితో తలమీద మసాజ్‌ చేసుకోండి.

11. ఆల్మండ్‌ నూనెతో తలను బాగా మసాజ్‌ చేసుకుని వేడినీటిలో టవల్‌ను ముంచి, దాన్ని నీరు కాకుండా లైట్‌గా పిండి, టవల్‌ను తలకు చుట్టుకోండి. ఓ అరగంట అలాగే ఉంచండి.

12. ఆమ్లా, రీత, శీకాకా§్‌ు వందేసి గ్రాములు తీసుకుని రెండు లీటర్ల నీటిలో కలిపి వేడిచేయండి. దాదాపు సగం నీరు ఆవిరయ్యేం తవరకూ వేడిచేయాలి. షాంపులా దాన్ని ఉపయోగించటం ద్వారా చుండ్రుపోవటమే కాక జుట్టు పట్టులా మారుతుంది. దట్టంగా ఉంటుంది.

13. మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌లా చేయండి. తలమీద చర్మంపై బాగా మసాజ్‌ చేసుకోండి. మసాజ్‌ అయ్యాక ఓ అరగంట సేపు అలానే ఉంచి చక్కగా షవర్‌ బాత్‌ చేయండి 

14. మందారగుజ్జుతో ఉసిరికపొడిగాని, బత్తాయి తొక్కల గుజ్జుని కలిపి వెంట్రుకలకి పట్టించండి. జుట్టు కుదుళ్లని తెరిపిస్తుంది. వెంట్రుకల ఎదుగుదల ప్రారంభమవుతుంది. అన్ని రకాల జుట్టు సమస్యలు పటాపంచలవుతాయి.

15. చందనం ఓ స్పూన్‌, తులసీ పుదీనా, అలోవెరా జెల్‌తో కలిపి మీ శరీరానికి రాసుకోండి. ఆరాక స్నానం చేస్తే మంచి ఛాయ మీసొంతమవుతుంది.

16. క్రమం తప్పకుండా తెల్లబడిన జుట్టుకు హెన్నాను వాడితే మిగిలిన జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

17.  పెరుగు, మజ్జిగను అధికంగా వాడటంతో పాటు కరివేపాకును ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. కరివేపాకు, ఉసిరికాయలను మజ్జిగలో నూరిన ప్యాక్‌ను వాడటంతో పాటు మందారం ఆకులను నూరి తలస్నానానికి వాడటం మరీ మంచిది. 

18. జుట్టు బాగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో చిక్కు తీసుకోవాలి. తలస్నానం చేసిన రోజులు తప్ప మిగిలిన రోజుల్లో గోరువెచ్చటి నూనెతో కుదుళ్లను తాకే విధంగా రాసి మునివేళ్లతో 15నిమిషాల పాటు మర్దనా చేస్తే జుట్టు పెరుగుతుంది.

 19. జుట్టు చిక్కును కింది నుంచి పైకి తీయాలి. అనుదినం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పెరుగు అధికంగా ఉండే విధంగా చూసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

20. పొడిబారిన జుట్టుకోసం బాగా పండిన అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి.