Sunday, August 24, 2014

కళ్ళ కి తీసుకోవలిసిన జాగ్రత్తలు health tips for eyes

1. రోజ రెండు లీటర్ ల నీరు  త్రాగితే చర్మానికే కాదు కంటికి కూడా చాల మంచిది .

2. అతినీలలోహిత కిరణాలు కంటి మీద పడకుండా గ్లాసెస్ పెట్టుకోవాలి .
\
3. పడుకోబోయే ముందు కళ్ళ  మీద కీర ముక్కలు పెట్టకుంటే మంచిది .లేదా రోజ్ వాటర్ కాళ్ళ మీద జల్లుకున్న చల్లగా ఉంటుంది

4. ఒక గ్లాస్ నీటిలో ఉసిరిపొడి వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో కళ్ళను కడగాలి. దానివల్ల కళ్లు తాజాగా మెరుస్తాయి.

Friday, August 22, 2014

ఆరోగ్యానికి పండ్లు ... fruits for health

1. ద్రాక్ష పళ్ళు :

దీనిలో పోషక పదార్థాలు , యాంటి ఆక్సిడెంట్లు , పైటో కెమికల్స్ , ఫైబర్ వంటివెన్నో ఉన్నాయి . ఇవి గుండె జబ్బులు రాకుండా మరియు రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతాయి . రక్త పోటు ని నివారిస్తాయి .

2. ఆపిల్:

యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . డయాబెటిస్ పెరగకుండా నియంత్రిస్తుంది . ఆస్థమాని దరి చేరనివ్వదు . నోటి దుర్వాసన రాకుండా చూస్తుంది .

3. అవకడో పళ్ళు :

శరీరంలో కొవ్వు ని తగ్గిస్తాయి.

4.బ్లాక్ బెర్రీ :

ఉపిరితితుత్తుల కాన్సర్ ని అడ్డుకుంటుంది . గౌట్ లాంటి జబ్బులతో బాధపడేవారికి బాగా పనిచేస్తాయి.

5.అరటి పళ్ళు :

అరటి పళ్ళల్లో  ఎక్కువ పొటాషియం లభిస్తుంది . ఇది రక్తపోటు ని నివారిస్తుంది .

6. బ్లూ బెర్రీ :

ఇందులో పీచు , యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ శాతం ఉంటాయి. వృద్ధాప్యం లో వచ్చే పార్కిన్ సన్ , అల్జీమర్స్ వంటి జబ్బులని నియంత్రిస్తుంది .

7.చెర్రి :

దీనికి  ఆర్థ రైటిస్ ,గౌట్ వంటి నొప్పుల్ని తగ్గించే గుణం ఎక్కువ .

8.ఫీగ్ పండు :

దీనిలో పొటాషియం , ఐరన్ ,కాల్షియం ఎక్కువ లభిస్తాయి.

9. గోజి బెర్రీ :

దీనిని నుట్రియంట్ పవర్ హౌస్ అని పిలుస్తారు . ఇందులో 6 రకాల విటమిన్స్ ,20 కి పైగా ఖనిజాలు ,యాంటి ఆక్సిడెంట్లు ఉన్నాయి.ఇవి డయాబెటిస్ ని తగ్గిస్తాయి .

10. కివి పళ్ళు : 

ఇవి ఎముకలు బలంగా ఉండేటట్టు చేస్తాయి . ఆరోగ్యకరమైన దంతాలకు , చిగుళ్ళ కి ఉపయోగపడతాయి . గండే జబ్బులకి కారణమయ్యే ట్రై గ్లిజరైడ్స్ ని నియంత్రిస్తాయి .

11. మామిడి పళ్ళు :

వీటిని తింటే  ద్రుష్టి సమస్యలు తలెత్తవ్ .. అలాగే కండరాల క్షినతని తగ్గిస్తాయి .

12. ఆరెంజ్ : 

ఇందులో సి విటమిన్ ఉంటుంది . గర్బినిలకి చాల మంచిది .

13.దానిమ్మ:

గుండె కి ఎంతో మంచిది రోజు తింటే రక్త పోటు , గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ .

14. పైనాపిల్ : 

ఇది జీర్ణ శక్తి ని మెరుగు పరుస్తుంది . శరీరానికి తగిలిన గాయాలను తొందరగా మానేట్టు చేస్తుంది .

15. పుచ్చకాయ : 

ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది . బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడ్తుంది.

Tuesday, August 12, 2014

కేశ సంరక్షణ చిట్కాలు tips for hair growth and damage

1. తల స్నానం వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు చేస్తూ జుట్టు ని శుభ్రంగా ఉంచుకోవాలి .

2. వారానికి రెండు సార్లు అయిన తల నూనెతో మర్ధన చేసుకోవాలి.

3.వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి

4.ఎక్కువగా జుట్టు రాలుతుంటే  ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోని దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

5. జింక్‌, అత్యవసర ఫాటీ ఆమ్లాలను కలిగిన గుమ్మడికాయ గింజలు, వేరుశనగలు, కూరగాయ నూనెలు చుండ్రుని తరిమికొడతాయి.

6. రోజూ రెండు లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగటానికి ప్రయత్నించండి.

7.   దువ్వెనలను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, నీట్‌గా ఉంచుకోండి. వీలయితే మీ దువ్వెన సెపరేట్‌గా ఉంచుకోండి.  రెగ్యులర్‌గా హెయిర్‌ను బ్రష్‌ చేసుకోండి. 

8.  రెండు టీ స్పూన్లు వెనిగర్‌ తీసుకోండి. దాన్ని ఆరు టీస్పూన్ల వాటర్‌లో కలపండి. రాత్రి నిద్రబోయే ముందు తలకి అనగా నెత్తిమీద చర్మానికి రాయండి. ఆపైన తలంతా కవర్‌ అయ్యేలా కప్పి ఉంచుకోండి. ఉదయాన్నే తలను వాష్‌ చేసుకోండి. షాంపూతో స్నానం అయ్యాక వెనిగర్‌ నీళ్లతో మరోసారి వాష్‌ చేసుకోండి. ఇలా నెలకి నాలుగుసార్లు చేయండి

9. ఒక టీస్పూన్‌ నిమ్మపండు రసాన్ని రెండు టీస్పూన్ల వెనిగర్‌ని కలపండి. దానితో తలని మసాజ్‌ చేసుకోండి. పది చేతివేళ్లు జుట్టు మధ్యలో నుంచి తలపై నున్న చర్మానికి అంటు కునేలా చేతివేళ్ల చర్మంతో మసాజ్‌ చేసుకోండి. ఆ తర్వాత ఎగ్‌షాంపూతో తలస్నానం చేయండి.

10. ఆల్మండ్‌ నూనె టీస్పూన్‌, సల్ఫర్‌ పొడి ఒక టీస్పూన్‌, స్పిరిట్‌ రెండు టీస్పూన్లు, నాలుగు టీ స్పూన్ల నీరు లేదా రోజ్‌వాటర్‌ తీసుకుని కలపండి. కలిపిన దానితో తలమీద మసాజ్‌ చేసుకోండి.

11. ఆల్మండ్‌ నూనెతో తలను బాగా మసాజ్‌ చేసుకుని వేడినీటిలో టవల్‌ను ముంచి, దాన్ని నీరు కాకుండా లైట్‌గా పిండి, టవల్‌ను తలకు చుట్టుకోండి. ఓ అరగంట అలాగే ఉంచండి.

12. ఆమ్లా, రీత, శీకాకా§్‌ు వందేసి గ్రాములు తీసుకుని రెండు లీటర్ల నీటిలో కలిపి వేడిచేయండి. దాదాపు సగం నీరు ఆవిరయ్యేం తవరకూ వేడిచేయాలి. షాంపులా దాన్ని ఉపయోగించటం ద్వారా చుండ్రుపోవటమే కాక జుట్టు పట్టులా మారుతుంది. దట్టంగా ఉంటుంది.

13. మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌లా చేయండి. తలమీద చర్మంపై బాగా మసాజ్‌ చేసుకోండి. మసాజ్‌ అయ్యాక ఓ అరగంట సేపు అలానే ఉంచి చక్కగా షవర్‌ బాత్‌ చేయండి 

14. మందారగుజ్జుతో ఉసిరికపొడిగాని, బత్తాయి తొక్కల గుజ్జుని కలిపి వెంట్రుకలకి పట్టించండి. జుట్టు కుదుళ్లని తెరిపిస్తుంది. వెంట్రుకల ఎదుగుదల ప్రారంభమవుతుంది. అన్ని రకాల జుట్టు సమస్యలు పటాపంచలవుతాయి.

15. చందనం ఓ స్పూన్‌, తులసీ పుదీనా, అలోవెరా జెల్‌తో కలిపి మీ శరీరానికి రాసుకోండి. ఆరాక స్నానం చేస్తే మంచి ఛాయ మీసొంతమవుతుంది.

16. క్రమం తప్పకుండా తెల్లబడిన జుట్టుకు హెన్నాను వాడితే మిగిలిన జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

17.  పెరుగు, మజ్జిగను అధికంగా వాడటంతో పాటు కరివేపాకును ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. కరివేపాకు, ఉసిరికాయలను మజ్జిగలో నూరిన ప్యాక్‌ను వాడటంతో పాటు మందారం ఆకులను నూరి తలస్నానానికి వాడటం మరీ మంచిది. 

18. జుట్టు బాగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో చిక్కు తీసుకోవాలి. తలస్నానం చేసిన రోజులు తప్ప మిగిలిన రోజుల్లో గోరువెచ్చటి నూనెతో కుదుళ్లను తాకే విధంగా రాసి మునివేళ్లతో 15నిమిషాల పాటు మర్దనా చేస్తే జుట్టు పెరుగుతుంది.

 19. జుట్టు చిక్కును కింది నుంచి పైకి తీయాలి. అనుదినం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పెరుగు అధికంగా ఉండే విధంగా చూసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

20. పొడిబారిన జుట్టుకోసం బాగా పండిన అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి.

దంత సంరక్షణ యే గుండె సంరక్షణ health tips for heart

దంతాలను శుభ్రం గా ఉంచుకునే  వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా  తక్కువ.

చిగుళ్ల లో ఉండే బాక్టీరియా అక్కడ ఉండే రక్తనాళాల్లో ప్రవేశించి గుండె కి హాని చేస్తాయి..కనుక రోజు కి రెండు సార్లు దంతాలను శుభ్రంగా తోముకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది

Friday, August 8, 2014

నలుపు తగ్గాలంటే

fair

గోళ్ళ సంరక్షణ health tips for nails

health tips for nails



కళ్ళు పొడి బారకుండా health tips for eyes

health tips for eyes

health tips for eyes

ఒక గ్లాస్ నీటిలో ఉసిరిపొడి వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో కళ్ళను కడగాలి. దానివల్ల కళ్లు తాజాగా మెరుస్తాయి.


Tuesday, August 5, 2014

స్మార్ట్‌గా యాక్టివ్‌గా ఉండాలంటే.....health tips for smart and active

స్మార్ట్‌గా యాక్టివ్‌గా ఉండాలి అంటే దానిమ్మ జ్యూస్ ప్రతి రోజు త్రాగాలి ఈ రసం తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే నిద్రలేమి, నీరసం, అలసటను దూరం చేసుకోవచ్చు. 
 
యాక్టివ్‌గా ఉండాలంటే రోజూ ఒక కప్పు గ్రీన్ టీ ని త్రాగాలి. ఒక కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది. అందుకు అవసరం అయ్యే ఇజిసిజి, లేదా ఎపిగలోకొటెచిన్-3-గల్లేట్ ను గ్రీన్ టీలో కనుగొనబడినది. ఇవి బ్రెయిన్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, బ్రెయిన్‌ను షార్ప్‌గా ఉంచుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఒక కప్పుబ్లాక్ టీని రెగ్యులర్ గా త్రాగడం వల్ల రియాక్షన్ టైమ్‌ను పెంచుతుంది 


రాగుల తో health tips

రాగులు బలవర్దకమయిన ధాన్యం. ఇక ఒకప్పుడు దీనిని పొద్దున్నే జావగా చేసి పాలల్లో,  మజ్జిగలో కలుపుకుని తాగేవారు మన పెద్దవాళ్ళు.ఎందుకంటే దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. రాగి జావకు, రాగి సంగటికీ రాగులతో చేసిన ఇతర ఆహార పదార్థాల వల్ల శరీరానికి అంత బలం చేకూరుతుంది. రాగుల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు 
1. రాగుల వల్ల జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.
2. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
3. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
4. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.
5. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
6. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.
7. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
8. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది

వెల్లుల్లి,క్యారట్,పాలకూర,లెట్యూస్,నిమ్మకాయ,ఉల్లి,మిరియాలు,బంగాళదుంప తో health tips

1.వెల్లుల్లి: వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. రోజూ వెల్లుల్లి వాడేవారికి రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండెపోటు వచ్చే అవకాశాలను, పక్షవాతాన్ని సమర్థంగా నివారించినట్లు అవుతుంది. దాని ఘాటువాసనకు క్యాన్సర్ పరార్. అంటే వెల్లుల్లి వాడేవారిలో గ్యాస్ట్రో ఇంటస్టినల్ క్యాన్సర్‌కు అవకాశాలు చాలా చాలా తక్కువ. ఇన్ని సుగుణాలు ఉండటం వల్ల న్యూట్రిషనిస్టులు కనీసం రోజుకు 5 – 6 వెల్లుల్లి రెబ్బలను సిఫార్సు చేస్తుంటారు.
2.క్యారట్: కంటిచూపును మెరుగుపరచే విటమిన్-ఎ పుట్టడానికి అవసరమైన బీటా-కెరోటిన్ క్యారట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారట్ రేచీకటిని నివారిస్తుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారట్ గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే క్యారట్ ఓ క్యాన్సర్ పోరాటయోధుడు. ఉత్తమ యాంటీ-క్యాన్సర్ కారకంగా ఉంటుంది. రోజూ ఒక చిన్న కప్పు క్యారట్స్ తింటే మనలోని కొలెస్ట్రాల్ 11% తగ్గుతుంది.
3.పాలకూర: గర్భవతికి రోజూ తినిపించడం మంచిది. ఎందుకంటే  దానిలో విటమిన్-సి, బి6, రైబోఫ్లేవిన్, ఐరన్, క్యాల్షియమ్… ఇవన్నీ ఉంటాయి. గర్భవతికి రాసే పోషకాహార సప్లిమెంట్ మాత్రల్లో ఉండాల్సినవన్నీ దాంట్లోనే ఉంటాయి. కాబట్టి వాటన్నింటి బదులు స్వాభావికంగా పాలకూర వాడటమే మంచిది కదా!
4.లెట్యూస్: బరువు తగ్గాలనుకుని అనుకునే వారు ఎక్కడికో పరుగు తీయాల్సిన అవసరంలేదు.. ఆకులు చాలు. అవే.. లెట్యూస్. శరీరానికి శ్రమ కలిగించని తేలికపాటి వ్యాయామం… దానితో పాటు లెట్యూస్ చాలు, తగ్గుతుంది ఒళ్లు. ఎందుకంటే ఇది లో క్యాలరీ డైట్. క్యాలరీలకే కొరత గానీ… విటమిన్-సి, ఫోలేట్, క్యాల్షియమ్, పొటాషియమ్ వీటికి కొదవ లేదు. రోజూ సాఫీగా విరేచనం కావాలంటే వేరే మందులు అక్కర్లేదు. రోజూ రాత్రిపూట తినే ఆహారంతో లెట్యూస్ తీసుకుంటే రాత్రికి తృప్తి. ఉదయాన సుఖ విరేచన సంతృప్తి.
5.నిమ్మకాయ: నిమ్మ మాత్రం ఎప్పుడూ జలుబును కా(ర)నివ్వదు. అందులోని విటమిన్-సి కారణంగా సంక్రమించే వ్యాధినిరోధకతతో జలుబును మాత్రమే కాదు, ఏ ఇన్ఫెక్షన్‌నూ తాకనివ్వదు. డాక్టర్లు మిమ్మల్ని ఉప్పు లేకుండా కూరల్ని తినమన్నారా? ఉప్పు లేని చప్పిడిదనాన్ని తప్పించి రుచి తెచ్చి మెప్పించేది నిమ్మ. ఇందులోని లిమోలిన్ అనే పోషకం క్యాన్సర్‌కు బద్ధశత్రువు.

6. ఉల్లి: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది ఔషధాలు కనిపెట్టకముందునుంచీ వాడుకలో ఉన్న సామెత. ఉల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టే రక్తాన్ని పలచబారుస్తుంది. బ్లడ్‌క్లాట్స్‌ను వడపోసి బయటకు పంపిస్తుంది. రియల్ యాంటీబ్యాక్టీరియల్ ఎఫెక్ట్‌తో సూపర్‌ఫీషియల్ ఇన్ఫెక్షన్స్‌ను నివారిస్తుంది. తనలోని ఘాటెత్తే గంధకంతో క్యాన్సర్ పాలిటి మందుగుండు ఉల్లి.
7. మిరియాలు:గొంతుకే కాదు. కళ్లకూ మిరియాలు మంచివే. ఎందుకంటే ట్యూటిన్, జియాగ్జాంథిన్, యాంటీఆక్సిడెంట్స్ ఉండి వాటితో కళ్లకు సంబంధించిన సమస్యలైన మాక్యులార్ డీజనరేషన్‌తో వచ్చే చూపు కోల్పోయే ప్రమాదాన్ని నివారిస్తుంటాయి. పైగా అందులోని ఫినోలిక్ యాసిడ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే నైట్రోసోయమైన్స్‌ను కరిగించివేస్తాయి. ఇలా చూస్తే క్యాన్సర్‌కు కవచం…

8. బంగాళదుంప: ఇవి తింటే లావెక్కుతారనేది పాక్షిక సత్యం మాత్రమే. ఇందులో విటమిన్-సి, బి6, పొటాషియం, మినరల్స్ ఉంటాయి. అందుకే మోతాదుకు మించకుండా తినాలి.ఎందుకంటే పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. మలబద్దకం లేకుండా చూస్తుంది.ఉడికించి తింటే ఉత్తమమే. ఇందుకు తార్కాణం ఒక్కటే… ఒక కప్పు అంత పెద్ద సైజు ఆలుగడ్డను ఉడికిస్తే అందులో 120-150 క్యాలరీలు ఉంటాయి. అదే వేపడం గానీ, ఫ్రెంచ్ ఫ్రైస్‌లా నూనెలో ఫ్రై చేయడం గానీ చేస్తే అందులో 355 క్యాలరీలు ఉంటాయి

Friday, August 1, 2014

కొబ్బరి నూనె తో ఆరోగ్యం cocount oil for googd health


cocount oil




మొటిమలు తగ్గటానికి

health tips

కొన్ని చిట్కాలు

health tips

-నిమ్మకాయ ముక్క తీసుకొని దానిమీద కొద్దిగా ఉప్పువేసి దానిని టూత్‌పేస్ట్‌లా పళ్లని శుభ్రపరచడానికి వారం రోజుల పాటు వాడితే పళ్ల మీద ఏర్పడిన పసుపురంగు పోయి పళ్లు తళతళలాడతాయి.
- గర్భిణులు పుచ్చకాయని వీలైనంత తరచుగా తింటే మెదడుకి, కడుపుకి మంచి బలాన్ని ఇవ్వడమే కాక మంచి రంగుతో ఉండే బిడ్డ పుడతాడు.

ముఖానికి health tips for face



beauty tips for face health tips for face
health tips for face


కొవ్వు ని కరిగించండిలా

health tips