1.పేస్ ప్యాక్ :
1. అర కప్పు స్ట్రాబెర్రీ లను తీస్కోని బాగా గుజ్జు లా చేసి ,ఒక టీ స్పూన్ తేనె ,అర టీ స్పూన్ నిమ్మ రసం కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి..ఈ ప్యాక్ ని ముఖానికి 10 నిముషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి . స్ట్రాబెర్రి ,నిమ్మ మలినాలని తొలగిస్తే తేనె చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది
4.కలబంద గుజ్జును మెడకి పట్టించి పావుగంట తర్వాత కడిగేసుకుంటే మెడ పై నలుపు పోతుంది.
2.మెడ పై నలుపు తగ్గటానికి చిట్కాలు
1.కీర దోస రసం లేదా గుజ్జు ని మెడ కి రాసుకుని నెమ్మది గా మర్దన చెయ్యాలి. తర్వాత రోజ్ వాటర్ తో తుడిచేయ్యాలి.ఇలా వారానికి ఒకసారి చెయ్యాలి.
2.బంగాళదుంప ముక్కని కాని రసంని కాని మెడ చుట్టూ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3.నిమ్మ రసం ని రోజ్ వాటర్ ని సమపాళ్ళల్లో తీసుకొని రోజు రాత్రి మెడ పై రాసుకొని మర్నాడు ఉదయం కడిగి వేస్తే మెడ పై నలుపు తగ్గుతుంది.
3. మఖం కోసం :
1. కనురెప్పల క్రింద వచ్చే ముడతలు పోవాలంటే పుచ్చకాయ రసంని ముడతల పై రాసుకోవాలి
2. వారానికొకసారి నిమ్మరసం లో గ్లిసరిన్ కలిపి మొహానికి రాసుకుంటే మొహం కళ కళ లాడుతుంది
3. మామిడి పండ్ల రసం,కాచి చల్లార్చిన చిక్కని పాలు కలిపి తిసుకంటే శరీరం కాంతివంతంగా కనిపిస్తంది
4. మెడ మీద నలుపు పోవాలంటే బంగాళదుంప రసంని రాసుకోవాలి
5. గులాబీ రేకుల్ని నూరి ముఖము పై రాసుకంటే నల్ల మచ్చలు మరియు మొటిమలు తగ్గిపోతాయి
No comments:
Post a Comment