Tuesday, July 29, 2014

వెల్లుల్లి

1. వెల్లుల్లి  కొలెస్ట్రాల్‌ను కరిగించి ఒబిసిటీని దూరం చేస్తుంది. అజీర్ణం, జలుబు, చెవు నొప్పి, గ్యాస్ట్రిక్, మొటిమలు, 

రక్త హీనత, రక్తపోటు వంటి వ్యాధులను వెల్లుల్లి దరిచేరనివ్వదు. 

2. వెల్లుల్లిలో విటమిన్స్, అయోడిన్, సల్ఫర్, క్లోరిన్, ఆంటి యాక్సిడెంట్లు వంటి పోషకాలున్నాయి. 

3. ఇవి చర్మ వ్యాధులను దూరం చేస్తాయి. వెల్లుల్లి పేస్టును చర్మంపై మొటిమలు, అలర్జీలపై రాస్తే ఉపశమనం

 ఉంటుంది. ఇంకా మచ్చులు మాయమవుతాయి.

4.  రక్తపోటు ఉన్నవారు రోజు రాత్రి నిద్రించేందుకు ముందు వెల్లుల్లిని పాలతో ఉడికించి.. కాస్త ఆరాక తాగితే   

రక్తపోటు తగ్గిపోతుంది. గుండెపోటు దూరమవుతుంది. రక్త నాళాల్లోని మలినాలు తొలగిపోతాయి.

5. వెల్లుల్లి రసంతో కాస్త కర్పూరాన్ని కలిపి మోకాలికి రాస్తే కీళ్ల నొప్పులు దూరమవుతాయి. అలాగే వెల్లుల్లి

 రసాన్ని చెవుల్లో ఐదారు చుక్కలు పోస్తే చెవునొప్పి నయం అవుతుంది. వెల్లుల్లి రసంలో కాస్త ఉప్పు కలిపి 

బెణికిన చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా వెల్లుల్లి, ఉల్లిపాయను రోజూ వంటల్లో చేర్చుకుంటే 

తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Monday, July 28, 2014

నూరేళ్ళు బ్రతకటానికి

1. మితాహారం తీసుకోవాలి . రాత్రి పడుకునే ముందు మితంగా తినాలి . అది కూడా 8pm  లోపు పూర్తిచెయ్యాలి .

2.ఎప్పుడు నవ్వుతూ ఉండాలి .


పేస్ ప్యాక్

1అర కప్పు స్ట్రాబెర్రీ లను తీస్కోని బాగా గుజ్జు లా చేసి ,ఒక టీ స్పూన్ తేనె ,అర తీ స్పూన్ నిమ్మ రసం కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి..ఈ ప్యాక్ ని ముఖానికి 10 నిముషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి . స్ట్రాబెర్రి ,నిమ్మ మలినాలని తొలగిస్తే తేనె చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది

రోజుకో అరటిపండు health tips for banana

1. రోజ కి 3 అరటి పళ్ళు తింటే గుండె పోటు నుండి దూరంగా ఉండవచ్చు. అరటి లో ఉండే పొటాషియం రక్తపోటు ని నియంత్రిస్తుంది.

2. అరటి శరీరం లో ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది .

3. 50 ఏళ్ళు పైబడిన మహిళల కి పొటాషియం ఎక్కువ అవసరం అవుతుంది . వీరు రోజు కో అరటి పండు తింటే 420 మిల్లి గ్రాముల పొటాషియం లభిస్తుంది .


మెడ పై నలుపు తగ్గటానికి చిట్కాలు

1.కీర దోస రసం లేదా గుజ్జు ని మెడ కి రాసుకుని నెమ్మది గా మర్దన చెయ్యాలి. తర్వాత రోజ్ వాటర్ తో తుడిచేయ్యాలి.ఇలా వారానికి ఒకసారి చెయ్యాలి.

2.బంగాళదుంప ముక్కని కాని రసంని కాని మెడ చుట్టూ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3.నిమ్మ రసం ని రోజ్ వాటర్ ని సమపాళ్ళల్లో తీసుకొని రోజు రాత్రి మెడ పై రాసుకొని మర్నాడు ఉదయం కడిగి వేస్తే మెడ పై నలుపు తగ్గుతుంది.

4.కలబంద గుజ్జును మెడకి పట్టించి పావుగంట తర్వాత కడిగేసుకుంటే మెడ పై నలుపు పోతుంది.

5.బాదాం నునె గోరువెచ్చగా చేసి మెడకి మర్దన చేసుకోవాలి.

6.కమల ఫలం తోక్కలపోడిలో పాలు పోసి పేస్టు లా చేసి మెడకి పట్టించి,ఆరిపోయాక కడిగేసుకోవాలి.ఇలా వారానికొకసారి చేస్తే ఫలితం మంచి ఉంటుంది. 

Saturday, July 5, 2014

HEALTH TIPS



 ఆరోగ్యమే మహా భాగ్యం.ఆరోగ్యం లేకుంటే ఆనందం లేదు.శరీరం లో 

అసాకర్యాన్ని భౌతిక అనారోగ్యం అంటారు.మనసు లో అసాకర్యాన్ని 

మానసిక అనారోగ్యం అంటారు.చక్కని ఆరోగ్యం కోసం ఈ బ్లాగ్ లో కొన్ని 

చిట్కాలు పొందుపరచడం అయినది.