వేరుశనగలు
వేరుశనగల్లో విటమిన్ ఇ, బి3 పుష్కలంగా ఉంటాయి. మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వేరుశనగగింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది.
పాలకూర
ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజు పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీసుకున్నా ఎంతో మంచిది. ఎముకల పటిష్టానికి పాలకూర దోహద పడుతుంది.
స్వీట్ పొటాటో
చిలకడ దుంపలు చక్కటి పోషకాహారం. ఈ దుంపలు శరీరానికి కావాల్సిన వేడిని అందిస్తాయి. పిల్లలకు, వృద్ధులకు ఇవి ఎంతో అవసరం. ఈ దుంపల్లో ఉండే పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, సీతో పాటు ఖనిజ లవణాల్ని శరీరానికి అందిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే టేస్టీగా ఉంటాయి.
జొన్నలు
వారానికి ఒక్కసారైనా జొన్నలతో చేసిన ఆహారం తీసుకోవాలి. జొన్నలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కండరాల కదలికలకు బాగా ఉపకరిస్తుంది. జొన్నతో చేసిన పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కూడా లభిస్తుంది.నువ్వులు
నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీస్, ఐరన్ మెగ్నీషియం వంటివి ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. నువ్వుల వల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది.దానిమ్మ
దానిమ్మ రక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది. చలికాలం దీని అవసరం చాలా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు, పాస్పరస్ కావాల్సినంత లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరం అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి.
No comments:
Post a Comment