1. స్థూలకాయం
ఉలవలను ఆహారరూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీకడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది.
2. బోదకాలు, కాళ్లవాపు
ఉలవల పిండినీ, పుట్టమన్నునూ ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకుని సమంగా కలిపి కోడిగుడ్డు తెల్లసొనను కలిపి స్థానికంగా లేపనం చేసే హితకరంగా ఉంటుంది.
3. కాళ్లుచేతుల్లో వాపులు, నొప్పి
ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనం మీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి.
4. శరీరంలో వ్రణాలు తయారవటం
పావుకప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావ్ఞ టేబుల్‌స్పూన్ అల్లం ముద్దను, పావ్ఞ టేబుల్‌స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటికి కలిపి ఉడికించి, తేనె కలిపి కనీసం నెలరోజుల పాటు తీసుకుంటే బాహ్యంగా అభ్యంత రంగా తయారైన వ్రణాలు (అల్సర్లు) త్వరితగతిన తగ్గుతాయి.
5. మూత్రంలో చురుకు, మంట
ఒక కప్పు ఉలవచారుకి సమానభాగం కొబ్బరినీరు కలిసి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవ్ఞతుంది.
6. మధుమేహం
మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంతో వెంపలి(శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది.
8. సెగగడ్డలు
ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపు పొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మం మీద తయారైన సెగగడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. ఉలవలతో కులత్థాద్యఘృతం, కులత్థాది ప్రలేపం, కులత్థయూషం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవ్ఞతాయి. ఉలవల్లో ప్రొటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
9. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు.
10. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి.
11. ఉలవలను తీసుకోవటం వల్ల మలనిర్వహణ సజావుగా, సాఫీగా జరుగుతుంది. ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది.
12. మహిళల్లో బహిష్టు రక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి సైతం హితం చేస్తాయి.

No comments:
Post a Comment