Saturday, September 13, 2014

పొట్ట తగ్గించుకోవడం మన చేతుల్లోనే! health tips for belly redction

కారణాలు మరియు నివారణలు 

1. పొట్ట పెరిగేందుకు దోహదం చేసే ఆహారంలో ముఖ్యంగా తెల్లని బియ్యం కారణంగా ఉదరభాగం ఉబ్బుగా మారే అవకాశాలు బాగా ఎక్కువ.కాబట్టి దానికి బదులుగా గోధుమలు, దంపుడు బియ్యం, జొన్నలు, కొర్రబియ్యం...వంటివి వాడడం మొదలు పెట్టాలి

2. చిన్న చిన్న పరిమాణాలలో పలు దఫాలుగా ఆహారం తీసుకునే వేళలు సవరించుకోవాలి. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ కాస్త ఎక్కువగా తీసుకన్నా పర్లేదు. అక్కడి నుంచి తగ్గిస్తూ వెళ్లాలి. రాత్రి 7-8గంటల లోపు తినే కార్యక్రమం ముగించడం అవసరం

3. అలాగే నిద్రపోయే వేళలు కూడా వీలున్నంత వరకూ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పైవన్నీ కనీసం 6వారాల పాటు క్రమం తప్పకుండా పాటించాలి. 

4. ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పుచేర్పులు చేయకుండా పొట్ట తగ్గించడం అసాధ్యం. ఆహారపు అలవాట్లు మార్చకుండా జిమ్‌లకు పరిగెడితే...అదనపు శారీరక శ్రమ వల్ల మనకు తెలీకుండానే మనం అదనంగా తింటాం. దాంతో పొట్ట తగ్గే అవకాశాలు మరింత తగ్గుతాయి. అందుకని ముందుగా పొట్ట పెరిగేందుకు దోహదం చేస్తున్న ఆహారాన్ని త్యజించాల్సిందే.

5. అవసరమైన షూస్‌, తగిన డ్రెస్‌ సిద్ధం చేసుకుని వాకింగ్‌ మొదలుపెట్టాలి. ప్రారంభంలో ఉదయం పూట కనీసం 20 నిమిషాలు తరువాత దశలవారీగా దాన్ని 40-60 నిమిషాల దాకా తీసుకెళ్లాలి

6.  సాధారణ వాకింగ్‌ రెండు వారాల పాటు మానకుండా చేశాక బ్రిస్క్‌ వాకింగ్‌ మొదలుపెట్టాలి. ఆ తర్వాత వాకింగ్‌, బ్రిస్క్‌వాకింగ్‌ కలిపి చేయాలి. మరో 2 వారాలు గడిచాక నిపుణుల పర్యవేక్షణలో అబ్డామినల్‌ క్రంచెస్‌ ప్రారంభించాలి. వీటిలో విభిన్న రకాలున్నాయి

7. వీటితో పాటుగా సైడ్‌ బెండ్స్‌, యోగాసనాలు, లైట్‌ వెయిట్స్‌తో స్ట్రెంగ్త్‌ ట్రయినింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ వంటివి కూడా వీలుని బట్టి అపుడపుడు జతచేస్తుండాలి. రోజుకి 30 నిమిషాలతో ప్రారంభించి గంట, గంటన్నర దాకా సమయాన్ని పెంచాలి. ఇలా 3నెలలు చేశాక , మెరుగైన ఫలితాల కోసం ఎక్సర్‌సైజ్‌ రొటీన్‌లో అవసరమైన మార్పుచేర్పులు చేసుకోవాలి . 

8. శరవేగంగా మార్పును ఆశించవద్దు. అలాగే మొదట్లోలాగే త్వరగా బరువు తగ్గుతామని అనుకోవద్దు. లేదా కృత్రిమ పద్ధతుల్లో తగ్గించేసుకోవాలని ఆరాటం వద్దు. ఆహారపు అలవాట్లలో మార్పు చేర్పులను కొనసాగిస్తూ, వ్యాయామం చేస్తుంటే నిదానంగా పొట్ట కరగడం ప్రారంభిస్తుంది. 

9. అయితే ఒకసారి కరిగిన పొట్ట తిరిగి రాకుండా శారీరక శ్రమని దినచర్యలో భాగం చేయడం అవసరం. లిఫ్ట్‌ వాడకుండా మెట్లు ఎక్కి దిగడం, చిన్న చిన్న దూరాలకు నడిచి వెళుతుండడం, ఆఫీసు, ఇంట్లో ఇలా ఎక్కడైనా సరే శరీరం కదిలేలా చలాకీగా పనులు నిర్వర్తిస్తుండడం...వంటివి చేస్తూ ఉండాలి . 

10. అబ్డామినల్‌ వ్యాయామాలలో విభిన్న రకాలను సాధన చేయాలి. అలాగే వెల్లకిలా పడుకుని చేసే బైసికిల్‌ ఎక్సర్‌సైజ్‌ను అత్యుత్తమమైనదిగా అమెరికన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్థారించింది. 

11. ది ప్లాంక్‌ (పుషప్‌ చేయడానికి చేతులు నేలకు ఆన్చి అదే భంగిమలో నిశ్చలంగా ఉండిపోయే వర్కవుట్‌) అనే వెరైటీ వ్యాయామం కూడా పొట్ట భాగాన్ని చదును చేసేందుకు చక్కని మార్గం.   

No comments:

Post a Comment