Wednesday, September 17, 2014

తల్లిపాలతో బిడ్డకి ఆరోగ్యం

తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఇప్పుడు డబ్బా పాలైపోయింది. డబ్బా పాల వ్యాపారం బాగా ఎక్కువైపోతోంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పిల్లలకు తల్లిపాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

1. ప్రసవానికి ముందుగానీ, ప్రసవం తర్వాత గానీ తల్లి ఎటువంటి మానసిక ఆందోళనలకు గురికాకూడదు. పూర్తిగా, విశ్రాంతిగా, ఉల్లాసంగా ఉండాలి. గర్భిణిగా ఉన్నప్పుడు జంక్‌ఫుడ్స్‌ జోలికి వెళ్లకుండా పోషకపదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

2. అప్పటికీ పాలు పడకపోతే...ప్రసవించగానే తల్లికి బ్రెడ్‌, పాలు ఆహారంగా ఇవ్వాలి.

3. వెల్లుల్లి ధనియాలను పొడిచేసి దానికి తగినంత ఉప్పు, కారం కలిపి అన్నంలో కలుపుకుని తినాలి.

4. జీలకర్రను దోరగా వేయించి మెత్తటి పొడిచేసి ఆవునెయ్యి కలుపుకుని తినాలి.

5. వామును పెనంపై నల్లగా మాడ్చి మెత్తగా పొడిచేసి, చిటికెడు పొడిని అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కలుపుకుని తినాలి. నెయ్యి వేసుకోవడం కూడా ముఖ్యమే.

6. శొంఠిపొడిని, బెల్లమును 1:4 నిష్పత్తిలో కలుపుకొని, చిన్నచిన్న ఉండలను రోజూ రెండుపూటలా తినాలి.

7. బార్లీ గింజలను పాలలో మెత్తగా మరిగించి దానికి చక్కెర కలిపి ఆ పాలను తాగాలి.

No comments:

Post a Comment