Wednesday, September 17, 2014

చర్మం మెరవటానికి ..tips for glowing skin


చర్మంలో మృతకణాలు ఎక్కువగా చేరే కాలమిది. అందువల్ల ముఖంలో కాంతి తగ్గుతుంది. ఆ సమస్య నుండి బయటపడాలంటే...

1. రెండు చెంచాల నిమ్మరసానికి కొద్దిగా ఆలివ్‌నూనె, తేనెతో పాటూ అరచెంచా పంచదార కలిపితే గరుకైన మిశ్రమం తయారవుతుంది. దాన్ని సున్నితంగా ముఖానికి మర్దన చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోవడంతో పాటూ చర్మానికి తేమ అంది కాంతులీనుతుంది.

2. పెద్ద చెంచా బొప్పాయి గుజ్జుకి అరచెంచా తేనె కలిపి వీటికి తగినంత పంచదార కలపాలి. ఆ మిశ్రమంతో గరుకుగా మారిన చోటల్లా మర్దన చేస్తే చర్మం తాజాగా మారుతుంది.

3. బేకింగ్‌ సోడాకి తగినన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమంతో కొన్ని నిమిషాల పాటు రుద్దాలి. అలాచేస్తే మృతకణాలు తొలగిపోతాయి. ఆ పై ముఖానికి బాగా పండిన అరటిపండు గుజ్జుకి కొద్దిగా పెరుగు, చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించి చూడండి. ముఖం నిగనిగలాడుతుంది.

4. పావుకప్పు పచ్చిపాలు తీసుకుని దానికి చెంచా తేనె కలపాలి. ఆ మిశ్రమానికి పంచదారని కలిపి ముఖానికి రుద్దినా మంచి ఫలితం ఉంటుంది.

5. కేరట్‌ గుజ్జు కూడా ఈ చల్లటి సీజన్‌లో చక్కగా ఉపయోగపడుతుంది. మెత్తగా ఉడికించిన గుజ్జుకి కొద్దిగా పంచదార కలిపి ఆ మిశ్రమంతో రుద్దితే మృతకణాలు తొలగిపోవడమే కాదు. చర్మానికి కావాల్సినంత పోషకాలూ అందుతాయి.

6. జీలకర్రని వేడినీళ్లలో వేసి ఉడికించాలి. ఈ నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

7. రెండు స్పూన్ల గోధుమపిండి, కప్పు పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత స్క్రబ్‌తో శుభ్రం చేయాలి. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

8. చర్మానికి అప్పటికప్పుడు మెరుపు రావాలంటే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చేసి కాసేపయ్యాక కడిగేయాలి. 

9. కమలాపండుని రెండుగా కత్తిరించి దాంతో చర్మంపై మృదువుగా రుద్దండి. ఇలా రోజూ చేస్తే నెల రోజుల్లో మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది!

No comments:

Post a Comment